Curd And Jaggery | వేసవి కాలంలో అందరూ చల్లని పదార్థాలను లేదా శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. ఈ కాలంలో పెరుగును చల్లగా తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇది మన శరీరంలోని వేడిని తగ్గించి వేసవి తాపం నుంచి ఉపశమనం అందిస్తుంది.శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుంది. అయితే పెరుగులో కాస్త బెల్లం కలిపి ఇంకా ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో పోషకాలను పొందవచ్చు. పెరుగు, బెల్లం మిశ్రమాన్ని తింటే జీర్ణాశయంలో ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. పెరుగు ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
పెరుగు, బెల్లం మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. పెరుగు, బెల్లం మిశ్రమాన్ని తినడం వల్ల మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావం తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు, బెల్లం మిశ్రమం ద్వారా ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారు పెరుగు, బెల్లం మిశ్రమాన్ని తింటే మేలు జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
పెరుగులో బెల్లం కలిపి తింటే రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నాడీ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటుంటే పురుషుల్లో లైంగిక పటుత్వం పెరుగుతుంది. శృంగారంలో యాక్టివ్గా పాల్గొంటారు. పెరుగు, బెల్లం మిశ్రమంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. హైబీపీ తగ్గుతుంది. బీపీ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రోజూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
పెరుగు, బెల్లం మిశ్రమంలో క్యాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే ఐరన్ దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పెరుగు, బెల్లం మిశ్రమంలో పలు రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కఫం సమస్య అధికంగా ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రాత్రి పూట తినకూడదు. మధ్యాహ్నం తినాలి.