Cumin And Ginger Water | అధిక బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్‌ను పాటించడంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే బరువును సులభంగా, వేగంగా తగ్గించడంలో జీలకర్ర, అల్లం నీళ్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ నీళ్లు బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. జీలకర్ర, అల్లం కలిపి నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను టీ రూపంలో తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు మ్యాజిక్ చేసినట్లు కరిగిపోతుంది.
జీలకర్ర, అల్లం నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరును మెరుగు పరుస్తాయి. అలాగే అల్లం వల్ల థర్మోజెనెసిస్ అనే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీంతో శరీరంలో వేడి పుడుతుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగిపోయి అధిక బరువు తగ్గుతారు.
జీలకర్ర, అల్లంలో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచే గుణాలు ఉన్నాయి. జీలకర్ర జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చూస్తుంది. అల్లం జీర్ణాశయాన్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. దీంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణక్రియ పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అల్లంలో ఆకలిని నియంత్రించే గుణాలు ఉంటాయి. జీలకర్ర కూడా ఆకలిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. అందువల్ల అల్లం, జీలకర్ర నీళ్లను తాగితే తిండిపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో అతిగా తినకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
జీలకర్ర, అల్లం నీళ్లు సహజసిద్ధమైన డైయురెటిక్‌గా పనిచేస్తాయి. అందువల్ల శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే పొట్టును ఫ్లాట్‌గా ఉంచడంలోనూ ఈ నీళ్లు సహాయ పడతాయి. జీలకర్ర, అల్లం రెండూ కూడా డిటాక్సిఫయింగ్ గుణాలను కలిగి ఉంటాయి. అంటే.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, కొవ్వును కరిగిస్తాయన్నమాట. దీంతో శరీరంలో రక్తసరఫరా సైతం మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
జీలకర్ర, అల్లం నీళ్లు కొవ్వులను మరింతగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. కనుక మనం తినే ఆహారంలో ఉండే కొవ్వు సులభంగా జీర్ణమవుతుంది. ఇది శరీరంలో పేరుకుపోదు. ఫలితంగా కొవ్వు నిల్వలు చేరవు. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. ఇలా జీలకర్ర, అల్లం నీళ్లను రోజూ తాగడం వల్ల అధిక బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు.