Corona Tips : ఈ జాగ్రత్తలు తీసుకోండి.. కరోనా నుంచి బయటపడండి
Corona Tips :కరోనాను జయించాలంటే ధైర్యంగా ఉండాలి ! ఎలాంటి భయాలకు తావివ్వకుండా ధైర్యంగా ఉంటూ తగిన చికిత్స తీసుకోవాలి !!
Corona Tips :కరోనాను జయించాలంటే ధైర్యంగా ఉండాలి ! ఎలాంటి భయాలకు తావివ్వకుండా ధైర్యంగా ఉంటూ తగిన చికిత్స తీసుకోవాలి !! అప్పుడే కొవిడ్-19 ( COVID-19 ) నుంచి త్వరగా కోలుకోగలుగుతాం. అంతేతప్ప కరోనా ( Coronavirus ) వచ్చిందని అనవసర భయాలకు పోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లొచ్చు. కాబట్టి వైరస్ లక్షణాలు కనిపించిన తొలి రోజు నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఈజీగా కరోనా నుంచి బయటపడొచ్చు. కరోనా లక్షణాలు కనిపించినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

- లక్షణాలు కనిపించిన మొదటి రోజే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోవాలి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
- రెండో రోజు ఆర్టీ- పీసీఆర్ ( RT-PCR ) టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఆ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే భయపడి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండే చికిత్స తీసుకోవచ్చు. ఒకవేళ నెగెటివ్ వచ్చినా.. కరోనా కాదని కచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఎందుకైనా మంచిది ఓ పది రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండటం మంచిది.

లక్షణాలు కనబడిన ఐదు రోజుల వరకు ఎలాంటి రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్ రేలు, సిటీ స్కాన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐదు రోజులు అయిపోయినా జ్వరం, దగ్గు తగ్గకపోతే వైద్యుల సూచన మేరకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఐదు నుంచి పది రోజుల మధ్యలో చెస్ట్ ఎక్స్ రే లేదా సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పే అవకాశం ఉంటుంది.

- లక్షణాలు మొదలైన ఐదో రోజు నుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి. పల్స్ రేట్ 94 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే మీ వైద్యుడికి తెలియజేయాలి.
- ఆక్సిజన్ లెవల్స్ 93 శాతం కంటే తక్కువగా ఉంటేనే ఆస్పత్రుల్లో చేరాలి. అది కూడా 90-93 శాతం ఆక్సిజన్ లెవల్స్ ఉన్నప్పటికీ ఆయాసం లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 90 శాతానికి పడిపోయినా.. తగిన విశ్రాంతి తీసుకుంటే మళ్లీ ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో రిలాక్స్‌గా ఉండాలి. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతున్నాయని, ఆస్పత్రిలో బెడ్ దొరుకుతుందో లేదో అని టెన్షన్ పడితే.. మరింత పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

- కరోనా వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవాలి. లేదంటే కరోనా నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. నీరసంగా కూడా ఉంటారు. కాబట్టి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎంతో కొంత తినాలి. డయాబెటిస్ ఉన్నవారు కూడా సరైన ఆహారం తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు ఇంట్లోనే షుగర్ టెస్ట్ చేసుకోవాలి. మందులు వాడాలి.

హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు విశ్రాంతి చాలా అవసరం. కంటి నిండా నిద్రపోవాలి. కరోనాతో బాధపడే సమయంలో కనీసం 12 గంటల నిద్ర అవసరం. కరోనా గురించి భయపెట్టే వార్తలకు దూరంగా ఉండాలి. మ్యూజిక్ వింటూ, ఇతర కాలక్షేపాలతో సరదాగా గడపాలి. ఆందోళన పెట్టించేలా స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చెప్పే సలహాలను పట్టించుకోకపోవడం మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

