Joint Pains | కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతుంది, చర్మం నిగారింపును కోల్పోతుంది, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కంటి చూపు మందగిస్తుంది.. ఇలా అనేకానేక దుష్పరిణామాల గురించి విన్నాం. కానీ, ఆ దెబ్బ ఎముకల మీద కూడా పడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కీళ్లనొప్పులు సహా వివిధ రుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మెనోపాజ్ మహిళల ఎముకల మీద కాలుష్య ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు. ఇదంతా కార్లు, ట్రక్కులు వెదజల్లే నైట్రస్ ఆక్సైడ్ వల్లే కావచ్చని ప్రాథమికమైన అంచనాకు వచ్చారు. పల్లెలతో పోలిస్తే.. నగర మహిళలకే ఈ ఇబ్బంది ఎక్కువ.