సెప్టెంబర్ వచ్చేసింది! అంటే.. వానలతోపాటు ఉష్ణోగ్రతలూ తగ్గుతాయి. ఈ క్రమంలో రాబోయే చలికాలం కోసం పెరటి తోటలను సిద్ధం చేసుకోవాలి. వింటర్కు తగ్గట్టుగా కొత్త రకం కూరగాయలు, ఆకు కూరలను పెంచుకోవాలి.
పాలకూర : వర్షాకాలంలో ఆకు కూరలకు చాలామంది దూరంగా ఉంటారు. ఎందుకంటే, వర్షాల వల్ల ఆకుకూరలు హానికరంగా మారుతాయి. వానలు తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో.. మీ పెరటి తోటల్లో పాలకూరను నాటుకోండి. అందులోనూ పాలకూర చలికాలంలో వేగంగా పెరుగుతుంది. అందులోనూ చిన్న పాలకూర కొన్ని వారాలలోనే చేతికి అందుతుంది.
ముల్లంగి: శరదృతువు వాతావరణానికి ముల్లంగి అనువైనది. చలి వాతావరణంలో ఇది త్వరగా పెరుగుతుంది. కేవలం మూడు వారాల్లోనే తాజా ముల్లంగి కోసుకోవచ్చు. పోషకాలతోపాటు రుచితో నిండిన ఈ ముల్లంగి.. చలికాలంలో వేధించే పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.
క్యారెట్: ఇక చల్లని వాతావరణంలో చక్కగా పండుతుంది. వీటిని పెరటి తోటల్లో నాటుకుంటే.. ఆరోగ్యాన్ని పెంచుకున్నట్లే!