Coconut Water With Honey | కొబ్బరి నీళ్లు, తేనె.. ఇవి రెండూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించేవే. కొబ్బరి నీళ్లను వేసవికాలంలోనే కాదు ప్రతి సీజన్లోనూ తాగాలి. వీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తేనె కూడా మనకు అద్భుతమైన లాభాలను అందిస్తుంది. అయితే ఈ రెండింటి కాంబినేషన్‌ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా. కొబ్బరినీళ్లు, తేనె కాంబినేషన్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవచ్చు. వీటిని కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లు, తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట తగ్గిపోతాయి.
జ్వరం వచ్చిన వారు ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు. ఉత్సాహం వస్తుంది. నీరసం పోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ల వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ సరైన స్థాయిలో ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. తేనె, కొబ్బరి నీళ్లను కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరినీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి, తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలను త్వరగా తగ్గేలా చేస్తుంది.
కొబ్బరినీళ్లు, తేనెల మిశ్రమాన్ని తాగితే ప్రీ బయోటిక్ ఆహారంలా పనిచేస్తుంది. అంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుందన్నమాట. దీంతో పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. విరేచనాల సమస్య తగ్గుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం. అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. తేనె, కొబ్బరినీళ్లు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమం గొంతులో ఏర్పడే గరగరను సైతం తగ్గిస్తుంది. గొంతు నొప్పి, మంట కూడా తగ్గిపోతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి శ్వాస సరిగ్గా లభిస్తుంది.
కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారు, బరువు అధికంగా ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక గ్లాస్ కొబ్బరినీళ్లకు గాను ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాల్సి ఉంటుంది. దీన్ని ఉదయం పరగడుపునే సేవిస్తే మంచిది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శరీరంలో శక్థి స్థాయిలు తగ్గవు. ఎంత పనిచేసినా నీరసం, అలసట రావు. అలర్జీలు ఉన్నవారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు, తేనె మిశ్రమం అందరికీ పడకపోవచ్చు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మీరు ఏదైనా డైట్‌ను మారిస్తే కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.