దంతాలు పాడవడం ఈరోజుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి దంతాల సమస్యలు ఉంటున్నాయి. చాక్లెట్లు, మిఠాయిలు తినడం ఈ సమస్యలకు కారణాలని అంతా అనుకుంటారు. కానీ, డాక్టర్ల ప్రకారం సమస్యకు మూలం పిల్లలకు డబ్బా పాలు పట్టడంలో ఉందట. రాత్రుళ్లు పాలు తాగినప్పుడు పిల్లల దంతాల్లో అవి అలాగే ఉండిపోతాయి. దీంతో నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఎక్కువసేపు ఇలానే ఉంటే, అది దంతాల మీద ఉండే ఎనామిల్ పొరపై దాడిచేస్తుంది. అలాదంతక్షయం మొదలవుతుంది. అందువల్ల పిల్లల దంతాలు పాడవకుండా ఉండటానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.