Tomato Fever | కరోనా, మంకీపాక్స్ మధ్య టొమాటో ఫీవర్ ప్రమాదం సైతం వేగంగా పెరుగుతున్నది. ఇప్పటికే కేరళలో పలు కేసులు నమోదవగా.. తాజాగా ఢిల్లీలోని ఇద్దరు చిన్నారుల్లోనూ లక్షణాలు కనిపించాయి. దీనిపై చర్మ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇన్ఫెక్షన్ తీవ్రమైంది ఏమీ కాదని, లక్షణాలు కనిపించిన సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. టొమాటో ఫీవర్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్‌కు వేగంగా వ్యాపిస్తుందని, ఈ క్రమంలో భద్రతా చర్యలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రెటరీ, చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ వివేక్ మల్హోత్ర తన పేషెంట్లిద్దరికి టొమాటో ఫీవర్ వచ్చిందని తెలిపారు.
పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అరికాళ్లు, అరచేతులు, నోటిపై బొబ్బలు వస్తాయని, అలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎనిమిది నుంచి పది రోజుల వరకు ఐసోలేషన్‌లో ఉంచడం ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో ఈ ఇన్ఫెక్షన్కు తీవ్రమైన చికిత్స అవసరం లేదని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ సభ్యుడు డాక్టర్ వికాస్ శర్మ పేర్కొన్నారు. సరైన సమయంలో అవసరమైన మందులు ఇస్తే ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుందన్నారు. లక్షణాలు కనిపించిన సందర్భంలో తల్లిదండ్రులు వైద్యుడిని సంపద్రించాలని, సొంత చికిత్స చేస్తే తీవ్రమవుతుందని హెచ్చరించారు. పిల్లలకు దగ్గరా ఉన్న సమయంలో మాస్క్‌లు, పీపీఈ కిట్‌ను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
టొమాటో ఫీవర్ సోకిన వారికి జ్వరం, అలసటగా అనిపిస్తుంది. ఆకలి లేకపోవడం, చేతులు, అరికాళ్లపై, నోటి లోపల ఎర్రటి దద్దుర్లు, వస్తాయి. దురద సైతం ఉంటుంది. అరచేతి, అరికాళ్లలో మంటగా ఉంటుంది. నోటిలో పుళ్ళు వస్తాయి. ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టొమటో ఫీవర్ సోకుతుంది. ఇది కొద్ది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. పాఠశాల, క్రీచ్లో ఉండే వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో దాంతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నారు. అయితే, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్న ఏ వయసు వారైనా.. వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.