న్యూఢిల్లీ : వంటల్లో సువాసన పెంచి మంచి రుచిని అందించేందుకు వెల్లుల్లిని వాడుతుంటారు. వెల్లుల్లి వంటకం ఫ్లేవర్‌ను పెంచడమే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ పదార్ధాలతోనే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి వాడకంతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని కూడా పలు అధ్యయనాలు వెల్లడించాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్ధంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. వెల్లుల్లి వాడకంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడమే కాకుండా రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం కావడంతో పాటు ఇది క్యాన్సర్‌నూ నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ డిజార్డర్స్కు వెల్లుల్లి అడ్డుకట్ట వేస్తుందని కూడా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇక వెల్లుల్లి వాడకంతో గుండె ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని చెబుతున్నారు. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా రోగనిరోధక వ్యవస్ధను వెల్లుల్లి బలోపేతం చేస్తుంది. సీజన్ మారినప్పుడల్లా వెంటాడే వైరస్లు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. వెల్లుల్లి సహజమైన యాంటీబయాటిక్గానూ పనిచేస్తుంది. తాజా వెల్లుల్లి తినడం ద్వారా కలోన్ క్యాన్సర్ ముప్పు 35 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.