Menstruation | పీరియడ్స్ సమయంలో ఇలా చేయండి.. బాధ నుంచి ఉపశమనం పొందండి
Menstruation | చాలా మందికి పీరియడ్స్‌ను తలుచుకుంటేనే వణుకు. ప్రత్యేకించి ఆ నిస్సత్తువ ప్రాణాల్ని తోడేస్తుంది. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్లో ఇదో భాగం. ఈ సమస్యకు అనేక కారణాలు. మనిషి శరీరంలో విడుదలయ్యే సెరటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉద్వేగాల్ని నియంత్రిస్తుంది.
Menstruation | చాలా మందికి పీరియడ్స్‌ను తలుచుకుంటేనే వణుకు. ప్రత్యేకించి ఆ నిస్సత్తువ ప్రాణాల్ని తోడేస్తుంది. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్లో ఇదో భాగం. ఈ సమస్యకు అనేక కారణాలు. మనిషి శరీరంలో విడుదలయ్యే సెరటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉద్వేగాల్ని నియంత్రిస్తుంది. పీరియడ్స్ సమయంలో సెరటోనిన్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా ఎనర్జీ లెవెల్స్ నేలచూపులు చూస్తాయి. నిస్సత్తువకు తొలి కారణమిదే. కొంతమందిలో అకారణంగా కోపం వచ్చేస్తుంది, చిన్నమాటకే దుఃఖం పొంగుకొస్తుంది. ఇవన్నీ సెరటోనిన్ ప్రభావాలే. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే..
- నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరం చల్లబడుతుంది. కొంతమేర ఉద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి.
- శరీరానికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అరటిపండు, చేపలు, యాపిల్, డార్క్ చాకొలెట్ మొదలైనవి బలాన్ని ఇవ్వడమే కాదు, మనసుకూ హాయినిస్తాయి.
- ఆ సమయంలో చాలామంది వ్యాయామం ఇష్టపడరు. కానీ ఏరోబిక్ కసరత్తుల వల్ల నీరసం వదిలిపోతుందనీ, ఏకాగ్రత పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- మరీ కష్టమైన భంగిమల జోలికి వెళ్లకుండా.. సులభమైన యోగాసనాలు సాధన చేయ వచ్చని చెబుతారు. ధ్యానం కూడా మంచిదేనంటారు.
- పడకగదిలో సరైన గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్త పడాలి. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది. కంటినిండా కునుకు మనసుకూ మంచి చేస్తుంది. క్రమంగా నిస్సత్తువ మాయం అవుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

