Food Poisoning | నిత్యం తీసుకునే ఆహారాల్లో శరీరానికి పడనివి ఉండటం లేదా వాటిలో రసాయనాలు ఉన్నట్లయితే.. అవి మనల్ని ఓ పట్టాన నిల్చోనివ్వవు. ఏ పనీ చేయనివ్వదు. కడుపులో నొప్పి తీవ్ర ఇబ్బంది పెడుతుంది. జ్వరంతో పాటు తలనొప్పి కూడా వేధిస్తుంది. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. దురద కూడా వస్తుంది. ఇదే ఫుడ్ బోర్న్ ఇల్నెస్. దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అని కూడా అంటుంటారు.
కలుషితాహారం, చెడిపోయిన పానీయాలను తీసుకోవడం వల్ల కలిగే సాధారణ సమస్యగా వైద్యులు పేర్కొంటుంటారు. దీని కారణంగా కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు జరుగుతుంటాయి. 60 ఏండ్లు పైబడినవారిలో, చిన్నారుల్లో, గర్భిణీల్లో, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటివి ఎదుర్కొంటున్నవారిలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా కనిపిస్తుంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. కలుషితాహారాలు, చెడిపోయిన ఆహారాలతో పాటు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ లేదా హానికారక రసాయనాలు గట్ ఫంక్షన్లకు అంతరాయం కలిగిస్తాయి. మనం తినే ఆహారాల్లో సూక్ష్మక్రిములను చూడలేం. కానీ అవి మన ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. మన దేశంలో ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి ఎక్కువగా ఎంటామీబా ఒక కారణం. క్యాంపిలోబాక్టర్ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా బ్యాక్టీరియా, ఈ కోలి బ్యాక్టీరియా, నోరోవైరస్ల వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
ఈ కోలి
ఫుడ్ పాయిజనింగ్తో సంబంధం ఉన్న సాధారణ బ్యాక్టీరియాల్లో ఇది ఒకటి. ఇది ఎక్కువగా ఉడకని మాంసం, కలుషితమైన నీరు, పాత పిండిలో ఉంటుంది. అందుకే మాంసాన్ని సరిగ్గా ఉడికించి మాత్రమే తినాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. బాగా ఉడికించిన మాంసాన్ని తినడం వల్ల క్రిములు తొలిగిపోయి సురక్షితంగా మారుతుంది. మురుగు నీరు, డ్రైనేజీ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఆహారాలను దూరం పెట్టడం ద్వారా ఈ కోలి బ్యాక్టీరియా రాకుండా చూడొచ్చు. ఈ కోలి బ్యాక్టీరియా వ్యాప్తి కారణంగా వాంతులు, వికారం, పొత్తికడుపు నొప్పి కలుగుతుంది. అయితే, ఈ కోలి రకం, శరీరంపై దాని ప్రభావాన్ని బట్టి నీటి, రక్త విరేచనాలు జరిగే ప్రమాదం ఉంటుంది.
సాల్మొనెల్లా
ఈ బ్యాక్టీరియా సాధారణంగా టైఫాయిడ్‌కు కారణమవుతుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా చాలా కూరగాయల్లో ఉంటుంది. ఇది నీటిలో కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల కలిగే ఆహార విషాన్ని సాల్మొనెలోసిస్ అంటారు. లూజ్ మోషన్స్, డయేరియా, తీవ్రమైన కడుపు నొప్పితో సహా తేలికపాటి నుంచి పెద్ద గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితి సాధారణంగా దీర్ఘకాలిక విరేచనాలకు కారణమవుతుంది.
విషాన్ని కలిగించే ఆహారాలివే..
ఫుడ్ పాయిజనింగ్ నివారణ ఇలా..
ఫుడ్ పాయిజనింగ్తో వచ్చే సమస్యలివీ..