Castor Oil In Navel Benefits | నాభిలో ఆముదం వేయడం వల్ల అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. సాంప్రదాయ వైద్యంలో పలు దేశాల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఎంతో పురాతన కాలం నుంచే ఇలా బొడ్డులో ఆముదం వేయడం ఒక చికిత్సగా కూడా ఉంది. బొడ్డులో ఆముదాన్ని వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీరానికి నాభి అనేది మధ్యస్థ స్థానంగా ఉంటుంది. అనేక అవయవాలకు నాడుల ద్వారా ఇది అనుసంధానం అవుతుంది.
కనుక నాభిలో ఆముదం వేస్తే చర్మం ద్వారా శరీరం శోషించుకుంటుంది. దీంతో మనకు ప్రయోజనాలు కలుగుతాయి. ఆముదంలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ అవయవాలు సరిగ్గా పనిచేసేందుకు ఆముదం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదాన్ని నాభిలో వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది.
బొడ్డులో ఆముదం వేయడం వల్ల చర్మానికి మృతుత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెదవుల పగుళ్లు, పాదాల పగుళ్లు, పొడి చర్మం సమస్య ఉన్నవారు ఈ చిట్కాను పాటించడం వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది. చర్మం తేమగా కూడా ఉంటుంది. నెలసరి సమయంలో మహిళలకు సాధారణంగానే తీవ్రమైన నొప్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆముదం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదాన్ని నాభిలో వేయడం వల్ల తీవ్రమైన నెలసరి నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఆముదంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల పొట్టలో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. అలాగే కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
ఆముదం సహజసిద్ధమైన డిటాక్సింగ్ ఏజెంట్గా పని చేస్తుంది. అందువల్ల బొడ్డులో ఆముదాన్ని వేస్తే లింఫ్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. ఆముదంలో ఉండే ఆంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల దృఢత్వం, శరీరంలోని వాపులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. కొన్ని చుక్కల ఆముదాన్ని బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలోకి ఆముదం ఇంకుతుంది. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి.
ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. దీంతో సంతానం కలగాలనుకునే వారికి మేలు జరుగుతుంది. బొడ్డులో ఆముదాన్ని వేయడం వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలకు రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీంతో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. ఇలా ఆముదంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.