AML | భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇందులో బ్లడ్ క్యాన్సర్‌తో పాటు అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మెట్రో నగరాల్లో 30-40 సంవత్సరాల వయసులోని యువతలో కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ ఆశయ్ కర్పే స్పందిస్తూ.. మొత్త బ్లడ్ క్యాన్సర్ కేసుల్లో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా కేసులు 10-15 శాతం వరకు ఉన్నాయని పేర్కొన్నారు. ఓ వైపు క్యాన్సర్ పెరుగుతున్నా ప్రస్తుతం కొత్త అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి రావడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో నిపుణులు ఈ అంశంపై సవివరంగా చర్చించారు.
సకాలంలో రోగ నిర్ధారణ, మెడిసిన్స్, అవగాహన, సరైన చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అక్యూట్ మైలోయిడ్ లుకేమియా అనేది ఎముక మజ్జలో పుట్టుకువచ్చే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అని మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ శ్యామ్ అగర్వాల్ తెలిపారు. దాంతో శరీరంలోని అసాధారణ కణాలు వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన రక్త కణాలను నిర్జీవంగా మారుస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్తో పోరాడే, ఆక్సిజన్‌ను అందించే, రక్తస్రావాన్ని నియంత్రించే శరీర సామర్థ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే, దీనికి అనేక మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఐవోసిడెనిబ్, ఐడీహెచ్1 ప్రభావవంతంగా ఉంటుందని, దాంతో పాటు కీమోథెరపీ, టార్గెటెడ్ తెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి పద్ధతులు కూడా చికిత్స సైతం అందుబాటులో ఉందని చెబుతున్నారు.
అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఎముక మజ్జ, రక్తంపై ప్రభావం చూపే ఒక రకమైన క్యాన్సర్. ఇది వేగంగా అభివృద్ధి చెందేరకం. చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇది సాధారణంగా 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కనిపిస్తుంది. అయితే, ఇటీవల కాలంలో యువకులు, పిల్లలను సైతం ప్రభావితం చేయడం ఆందోళన కలిగిస్తున్నది. అధికంగా జర్వరం, చలి, అసాధారణ రక్తస్రావం, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, సులభంగా గాయాలు అవ్వడం, రాత్రి సమయంలో రాత్రి చెమటలు పట్టం లక్షణాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. కానీ, జన్యుపరమైన సమస్యలు కూడా కారణం కావొచ్చని చెబుతున్నారు. అక్యూట్ మైలోడ్ లుకేమియా ఎముక మజ్జలో మొదలవుతుంది. ఇక్కడే రక్త కణాలు ఏర్పడే విషయం తెలిసిందే. ఈ క్యాన్సర్ సాధారణ రక్త కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. రక్త పరీక్షలు, ఎముక మజ్జ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. చికిత్సలో కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి చేస్తారు. అయితే, లక్షణాలు కనిపించిన సమయంలో లక్షణాలు కనిపించిన సందర్భంలో నిర్లక్ష్యం చేయొద్దని.. సరైన సమయంలో సకాలంలో సరైన చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.