Quail Eggs | ప్రపంచ వ్యాప్తంగా కేవలం కోళ్లకు చెందిన గుడ్లనే కాదు, పలు ఇతర పక్షులకు చెందిన గుడ్లను కూడా తింటుంటారు. అలాంటి పక్షుల్లో కౌజు పిట్టలు కూడా ఒకటి. కౌజు పిట్టల మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు వీటి మాంసాన్ని ఇష్టంగా తింటారు. అయితే కేవలం మాంసం మాత్రమే కాదు, కౌజు పిట్టలకు చెందిన గుడ్లను కూడా మనం తినవచ్చు. వీటిని తినడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కౌజు పిట్టల గుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ గుడ్లను కూడా కోడిగుడ్లలాగే తినవచ్చు. కౌజు పిట్టల గుడ్లను తింటే అనేక పోషకాలు లభించడంతోపాటు శరీరానికి శక్తి కూడా అందుతుంది. ఈ గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటారు.
కౌజు పిట్టల గుడ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి12, సెలీనియం, రైబోఫ్లేవిన్, కోలిన్ వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. సెలీనియం, రైబోఫ్లేవిన్ వల్ల శరీరం మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి సరిగ్గా లభిస్తుంది. విటమిన్ బి12 వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ గుడ్లను తినడం వల్ల ఐరన్ సైతం అధికంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీంతో రక్తం వృద్ది చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ గుడ్లలో అధికంగా ఉండే కోలిన్ వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్గా మారి ఉత్తేజంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. అలాగే కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు బలం లభిస్తుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కౌజు పిట్టల గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ఉంటాయి. అలాగే ఈ గుడ్లలో అధికంగా ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. కౌజు పిట్టల గుడ్లలో ఓవోమ్యుకోయిడ్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది యాంటీ అలర్జిక్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక అలర్జీ ఉన్నవారికి ఈ గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ గుడ్లలో అధికంగా ఉండే ప్రోటీన్ల వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గుడ్లలో విటమిన్ డి, క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా అధికంగానే లభిస్తాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.
కౌజు పిట్టల గుడ్లను కూడా కోడిగుడ్లలాగే తినవచ్చు. వీటిని వారానికి 3 నుంచి 4 వరకు తినవచ్చు. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు అయితే ఈ గుడ్లను వారానికి 6 నుంచి 12 వరకు తినవచ్చు. కౌజు పిట్టల గుడ్లపై కోడిగుడ్ల కన్నా అధిక మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుంది. కనుక కౌజు పిట్టల గుడ్లను ఉడకబెట్టే ముందు లేదా ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగితే మంచిది. లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. గర్భిణీలు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ గుడ్లను తినకూడదు. వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు ఈ గుడ్లను తింటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఇలా ఆయా జాగ్రత్తలను పాటిస్తూ కౌజు పిట్టల గుడ్లను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.