Eggs
Cholesterol In Eggs | కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కోడిగుడ్లను చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా సాయంత్రం స్నాక్స్‌లాగా తింటుంటారు. అధిక బరువు తగ్గేందుకు, కండరాల నిర్మాణానికి చాలా మంది గుడ్లను తింటారు. అయితే కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక వాటిని తింటే శరీరంలో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకనే అలాంటి వారు కోడిగుడ్లను తినడంలో వెనుకంజ వేస్తుంటారు. అయితే నిజంగానే గుడ్లను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయా.. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మన శరీరానికి కూడా కొంత కొలెస్ట్రాల్ అవసరమే. దీంతో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అలాగే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే బైల్ యాసిడ్స్ ఉత్పత్తి అవ్వాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. అయితే మనం తినే ఆహారాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను లివర్ సేకరించి నిల్వ చేసుకుంటుంది. తరువాత అవసరం అయినప్పుడు ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలోనే కోడిగుడ్డు పచ్చ సొనతోపాటు పలు రకాల మాంసాహారాలు, చీజ్‌లోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల ఈ ఆహారాలను తింటే మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది.
అయితే కోడిగుడ్లలో చాలా స్వల్ప మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మన శరీరానికి హాని చేయదు. ఇది మన శరీరానికి ఉపయోగపడుతుంది. రోజుకు కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రాములు దాటితే ప్రమాదం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ గుడ్లలో చాలా తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల వాటిని తింటే మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు. అది వినియోగం అవుతుంది. దీంతో మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక కోడిగుడ్లను ఎవరైనా సరే నిర్భయంగా తినవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ పేరుకుపోదు.
అయితే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్ సూచనతోనే కోడిగుడ్లను తినాల్సి ఉంటుంది. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి బీపీ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే మాత్రం కోడిగుడ్లను తినకపోవడమే మంచిది. అలాంటి వారు కోడిగుడ్లకు దూరంగా ఉండాలి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆకుకూరలను తరచూ తింటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. తగిన పౌష్టికాహారం తీసుకోవాలి. నూన వస్తువులను తినడం మానేయాలి. ఇలా పలు సూచనలు పాటిస్తే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
అధికంగా బరువు ఉన్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. అలాగే కోడిగుడ్లను రోజుకు ఒకటికి మించి తినకూడదు. తింటే కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లను రోజూ తింటున్న వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.