గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 01, 2020 , 18:32:26

ఉల్లికాడ.. ఉపకారి

ఉల్లికాడ.. ఉపకారి

ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలాకాలం సంప్రదాయ మందుల్లో విదేశాలు ఉల్లికాడల్ని వాడాయి. ఇందులో ఉండే ప్రయోజనాలు తెలిస్తే ఉల్లికాడల్ని ఆహారంలో భాగం చేసుకోకుండా ఉండరు.

  • ఉల్లికాడల్లో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ బి2, థయామిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇది విటమిన్‌ ఎ, విటమిన్‌ కెని కూడా కలిగి ఉంటుంది. కాపర్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్‌, ఫైబర్‌లు దాగి ఉంటాయి. ఉల్లికాడల్ని తరచూ ఆహారంలో తీసుకునే వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచివి. ఇది కొలెస్ట్రాల్‌ ఆక్సీకరణను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది.
  • ఉల్లికాడల్లో ఉన్న క్రోమియం కంటెంట్‌ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలో చాలా సహాయకారిగా పనిచేస్తుంది.
  • ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సాయపడుతుంది.  ఉల్లికాడల్లోని పెక్టిన్‌(నీటిలో కరిగే కొల్లాయిడల్‌ కార్బోహైడ్రేట్‌) ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్‌ కారకాల్ని తగ్గిస్తుంది.
  • ఉల్లికాడలు రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారికి కంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇందులోని అల్లసిన్‌ చర్మానికి ఎంతో మంచిది. చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.


logo
>>>>>>