Health | ప్రసవం తర్వాత పాలు పడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Health | ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడటం, పడకపోవడం అన్నది ప్రధానంగా మానసికమైన విషయం. తాను బిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వగలను అని తల్లి నమ్మితే.. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తే.. పాలధార సమృద్ధిగానే ఉంటుంది. కనీసం ఆరునెలలు నిండేదాకా పాపాయికి పాలు తప్ప మరో ఆహారం ఇవ్వకూడదు.
Health | ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడాలంటే కన్నతల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే నెలల్లో ఏం తినాలి?
– ఓ పాఠకురాలు
ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడటం, పడకపోవడం అన్నది ప్రధానంగా మానసికమైన విషయం. తాను బిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వగలను అని తల్లి నమ్మితే.. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తే.. పాలధార సమృద్ధిగానే ఉంటుంది. కనీసం ఆరునెలలు నిండేదాకా పాపాయికి పాలు తప్ప మరో ఆహారం ఇవ్వకూడదు. ఇందుకోసం తల్లి చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి. పాపాయి ఎదుగుదలకు అవసరమైనవీ, తన ఆరోగ్యానికి కావలసినవీ.. అన్నీ తినాలి. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. అవును. పాలు బాగా పడాలంటే నీళ్లు అధికంగా తాగడం అవసరం. పాల ఉత్పత్తి ఎక్కువ అవడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల్ని ఆంగ్లంలో గెలాక్టోగాగ్స్గా పిలుస్తారు. వెల్లుల్లి, దొండకాయ, బీరకాయ లాంటివి ఈ కోవలోకి వస్తాయి.
రోజూ ఉదయం ఒక చెంచాడు నానబెట్టిన మెంతులు తిన్నా మంచిదే. పచ్చి బొప్పాయి కూడా మేలు చేస్తుంది. నిజానికి బాలింతలు అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు. తినాలి కూడా. ఎందుకంటే, పాపాయికి కావలసిన ఐరన్, క్యాల్షియం, విటమిన్ల లాంటివాటిని సరిపడా పాలతో పాటు ఇస్తుంది శరీరం. అలాంటప్పుడు తల్లి సరిగ్గా తినకపోతే ఆయా ఖనిజలవణాల లోపం ఏర్పడుతుంది. పథ్యం అంటూ పప్పుల్ని దూరం పెట్టకూడదు. కూరగాయలు, పండ్లు బాగా తీసుకోవాలి. అన్నం తక్కువగా తిన్నా ఆ స్థానంలో మిల్లెట్లు, బ్రౌన్ రైస్‌లాంటివి తీసుకోవాలి. వారానికి మూడుసార్లు తప్పక ఆకుకూరలు తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్ మంచివే. మాంసాహారులయితే కీమా తినడం మంచిది. నడకలాంటి తేలికపాటి వ్యాయామాలు జోడిస్తే బరువు నియంత్రణలో ఉంచుకుంటూనే.. ఆరోగ్యంగా ఉండవచ్చు.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read More :
“Pregnancy | ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు మస్ట్‌గా పాటించండి”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

