Pregnancy | గర్భిణులు ఉసిరికాయలు తినొచ్చా? ఏడోనెలలో తింటే కడుపులోని బిడ్డపై మచ్చలు ఏర్పడతాయా?
Pregnancy | నమస్తే. నాకిప్పుడు ఏడో నెల. ఉసిరికాయలు తినాలనిపిస్తున్నది. కానీ నెలలు నిండుతున్నప్పుడు ఉసిరికాయలు తింటే కడుపులోని బిడ్డ ఒంటి మీద నల్ల మచ్చలు ఏర్పడతాయని అంటున్నారు. నిజమేనా?
Pregnancy | నమస్తే. నాకిప్పుడు ఏడో నెల. ఉసిరికాయలు తినాలనిపిస్తున్నది. కానీ నెలలు నిండుతున్నప్పుడు ఉసిరికాయలు తింటే కడుపులోని బిడ్డ ఒంటి మీద నల్ల మచ్చలు ఏర్పడతాయని అంటున్నారు. నిజమేనా?
కడుపుతో ఉన్నప్పుడు పులుపు తినాలనిపించడం సహజమే. కొంతమందికి తొలి నెలల్లోనే ఈ కోరికలు కలిగితే, కొంతమందికి నెలలు నిండుతున్నా పులుపు మీదికి మనసు లాగుతూనే ఉంటుంది. ఇది చాలా సాధారణం. కాబట్టి మీకు ఉసిరికాయలు తినాలనిపిస్తే చక్కగా తినండి. దీనివల్ల బిడ్డ శరీరం మీద నల్లమచ్చలు ఏర్పడతాయన్నది నిజం కాదు. పైగా వీటిలోని విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్ బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి.
అందులోనూ, ఉసిరికాయ పచ్చడి రూపంలో కంటే.. నేరుగా తింటే ఇంకా మంచిది. గర్భిణుల ఆహార విషయానికి వస్తే, ఉడకబెట్టిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వేపుళ్లు తగ్గించాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు తక్కువ తినాలి. కూరగాయలు, అన్నిరకాల పండ్లు తీసుకోవచ్చు. ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Amla
- Health news
- pregnancy
- Pregnant
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

