Pregnancy | ఏడు నెలల గర్భిణులు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చా?
Pregnancy | ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోత. వేసవిలో రెండూ కలిసి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఫలితంగా చర్మం రంగుమారిపోతుంది. నిస్తేజం అవుతుంది. మచ్చలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు.
Pregnancy | మేడమ్. నేను ఏడు నెలల గర్భిణిని. మరో నెల రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. వేసవి ఎండల్ని తట్టుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చా?
ఓ పాఠకురాలు
ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోత. వేసవిలో రెండూ కలిసి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఫలితంగా చర్మం రంగుమారిపోతుంది. నిస్తేజం అవుతుంది. మచ్చలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగపడుతుంది. ఎలాంటి రక్షణ లేకుండా ఎండలోకి వెళ్లడం క్షేమం కాదు. ఎండాకాలం మధ్యాహ్నం వేళల్లో సూర్యకాంతితోపాటు వివిధ హానికర కిరణాలూ భూమి మీదికి ప్రసరిస్తాయి. వీటి నుంచి కూడా సన్‌స్క్రీన్ లోషన్ చర్మాన్ని కాపాడుతుంది. మచ్చలు, పొడిచర్మం, హైపర్ పిగ్మెంటేషన్, ముడతలు తదితర ఇబ్బందికర సమస్యలను అడ్డుకుంటుంది. ఈమధ్య తయారీదారులు సన్‌స్క్రీన్ లోషన్‌కు అదనపు హంగులు అద్దుతున్నారు. కొత్త పోషకాలు జోడిస్తున్నారు. దీంతో చర్మానికి నిగారింపు పెరుగుతుంది, ఆరోగ్యవంతంగానూ ఉంటుంది.
గర్భిణులు సైతం నిరభ్యంతరంగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. అలా అని అన్ని ఉత్పత్తులూ సురక్షితం కాదు. కనీసం ఎస్పీఎఫ్ 30 (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) ఉన్న వాటినే ఉపయోగించాలి. రసాయనాలలో ముంచితేల్చిన లోషన్ ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి ఉత్పత్తులు చర్మంలోకి చొచ్చుకుపోయి గర్భస్థ శిశువుకు హానిచేస్తాయి. అలర్జీలకు కారణం అవుతాయి. కాబట్టి, కాస్మటాలజిస్ట్ సలహాతో మీ చర్మ స్వభావానికి అనువైన సన్‌స్క్రీన్ లోషన్ ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్ లోషన్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. బయటికి వెళ్లేవారు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన లేదు. సూర్యకాంతి ఏ రూపంలో అయినా మనల్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, ఇంట్లో ఉండేవారు సైతం సన్‌స్క్రీన్ లోషన్ సాయం తీసుకోవచ్చు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

