Pregnancy | నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ సాధ్యమేనా?
Pregnancy | నొప్పులు ఎక్కువగా తెలియకుండానే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు మన దగ్గరా అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్టు పెయిన్స్ రాగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాన్ని ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు. నొప్పులు మొదలై.. గర్భాశయ ముఖద్వారం కనీసం నాలుగు సెంటీమీటర్లు తెరుచుకున్నాక... మత్తు డాక్టర్ సాయంతో ఈ ఇంజెక్షన్ ఇస్తాం.
Pregnancy | మేడమ్! నా వయసు ఇరవై ఏడు. ప్రస్తుతం ఎనిమిదో నెల. నాకు ప్రసవం అంటే భయం. మా కజిన్‌కు అమెరికాలో డెలివరీ అయ్యింది. అక్కడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి నొప్పులు తెలియకుండా సాధారణ ప్రసవం చేశారట. ఏమిటా ఇంజెక్షన్? మన దగ్గర కూడా లభిస్తుందా? ఇబ్బందులేమైనా ఉంటాయా?
– ఓ పాఠకురాలు
నొప్పులు ఎక్కువగా తెలియకుండానే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు మన దగ్గరా అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్టు పెయిన్స్ రాగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. దాన్ని ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు. నొప్పులు మొదలై.. గర్భాశయ ముఖద్వారం కనీసం నాలుగు సెంటీమీటర్లు తెరుచుకున్నాక… మత్తు డాక్టర్ సాయంతో ఈ ఇంజెక్షన్ ఇస్తాం. దీనివల్ల పెద్దగా నొప్పులు తెలియవు. ప్రసవానికి సంబంధించిన సంకోచ వ్యాకోచాలు కూడా సాధారణంగానే ఉంటాయి. దాంతో సాధారణ ప్రసవం అవుతుంది. అయితే నొప్పి తెలియకపోవడం వల్ల ఓ ఇబ్బంది ఉంది. ఒక్కోసారి బిడ్డ తల బయటికి వచ్చాక కూడా పూర్తి శరీరం బయటికి వచ్చేందుకు అనువుగా ముక్కలేకపోతారు.
ఫోర్సెప్స్ లేదా వాక్యూమ్‌లను వాడి శిశువును బయటికి తీయాల్సివస్తుంది. ఏదైనా లోపల ఇబ్బంది కలిగి సాధారణ ప్రసవానికి అవకాశం లేకపోతే.. వెంటనే సిజేరియన్ చేయవచ్చు. రెండోరకం, లేబర్ ఎనాల్జీషియా. ఈ ఇంజెక్షన్ వల్ల కూడా నొప్పులు ఎక్కువగా తెలియవు. దీన్ని గైనకాలజిస్టే ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ సిజేరియన్ అవసరమైతే మళ్లీ మత్తు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇంజెక్షన్ సాయంతో ప్రసవం చేయడం వల్ల కొన్నిసార్లు బాలింతలు మూత్రం మీద పట్టుకోల్పోతారు. కొద్ది రోజులు ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటారు. కాబట్టి, నొప్పులు ఎక్కువగా తెలియని సుఖప్రసవానికి మీకూ అవకాశం ఉంది. భయపడనక్కర్లేదు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

