కొన్నేళ్లుగా యువతరంలో కూడా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 20 ఏళ్లకే ఎముకలు బలహీనమైపోతున్నాయి. పెళుసుబారుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, శారీరక కదలికలు లేకపోవడం, ఊబకాయం, క్యాల్షియం, విటమిన్ డి లోపం మొదలైన కారణాల వల్ల ఎముకల సాంద్రత తగ్గుతున్నది. ఇది ఆస్టియోపొరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలకు దారితీస్తున్నది.
పాదాల్లో నొప్పి ఉండటం ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. సరిపోని షూలు ధరించడం, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఇలా జరుగుతుంది. వీటికి అదనంగా జీవనశైలి వ్యాధులు కూడా పాదాలపై దాడి చేస్తున్నాయి. మడమ, అరికాలు ప్రాంతంలో కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇంకొంతమందిలో మడమ, చీలమండ (యాంకిల్) మధ్య ఉంటుంది. ఎక్కువమంది మాత్రం నాడీ వ్యవస్థ రుగ్మత అయిన న్యూరోపతిక్ పెయిన్ వల్ల నొప్పితో బాధ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకల నొప్పి, కీళ్లనొప్పి నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.
ఆరోగ్యకరమైన ఎముక : టీ స్కోర్ 1 కంటే ఎక్కువ ఉండాలి.
ఆస్టియోపీనియా (ఎముకలు బలం కోల్పోవడం) : టీ స్కోర్ 1 నుంచి మైనస్ 2.5 మధ్య ఉంటుంది.
ఆస్టియోపొరోసిస్ (ఎముకలు గుల్లబారడం) : టీ స్కోర్ మైనస్ 2.5 కంటే తక్కువ.
ఇవన్నీ వేసవిలో కీళ్లనొప్పులు పెరగడానికి కారణం అవుతాయి. ఇలాంటప్పుడు ఆవాల నూనెతో నొప్పి ఉన్న భాగాలను మర్దనా చేసుకోవాలి. వేడి కంప్రెస్ను ఉంచినా మంచిదే. గోరువెచ్చటి నీటికి సైంధవ లవణం కలిపి మర్దనా చేసినా ఫలితం ఉంటుంది.