Bitter Taste After Fever | సీజన్లు మారినప్పుడు లేదా దోమలు కుట్టినప్పుడు, ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు సాధారణంగా చాలా మందికి జ్వరం వస్తుంది. ఇది అనేక రకాలుగా ఉంటుంది. సీజన్లు మారినప్పుడు సాధారణ జ్వరం వస్తుంది. కానీ దోమలు కుట్టినా లేదా ఫుడ్ పాయిజన్ అయినా విష జ్వరాలు వస్తాయి. అయితే జ్వరం ఏదైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఈ క్రమంలోనే జ్వరం తీవ్రతను బట్టి వైద్యులు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అయితే జ్వరానికి ఇచ్చే మందులను వాడితే సహజంగానే నోరంతా చేదుగా మారుతుంది. దీంతో చాలా మంది ఆహారాలను సరిగ్గా తినలేరు. జ్వరం తగ్గిన తరువాత మందులను వాడడం ఆపేసినా కూడా నోట్లో చేదు తగ్గదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే పలు చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. నోట్లో చేదును త్వరగా పోగొట్టవచ్చు.
జ్వరం తగ్గిన తరువాత నోట్లో ఉండే చేదు త్వరగా తగ్గాలంటే అందుకు పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే నోట్లో చేదుకు కారణం అయ్యే పదార్థాలను తొలగిస్తాయి. ఇక ఇందుకు గాను 3 లేదా 4 పుదీనా ఆకులను తీసుకుని బాగా కడిగి అనంతరం వాటిని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నోట్లో ఉండే చేదు త్వరగా తగ్గుతుంది. మళ్లీ ఆహారాల రుచి సరిగ్గా తెలుస్తుంది. ఇక ఈ సమస్యకు కొత్తిమీర ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. నోట్లోని చేదును తగ్గించుకునేందుకు గాను కొత్తిమీర ఆకులను తినవచ్చు. వీటిని నములుతున్నా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను, ఎండు కారాన్ని వేసి దంచి వెల్లుల్లి కారం చేయాలి. దీన్ని అన్నంలో నెయ్యితో కలిపి తినాలి. ఇలా రెండు పూటలు చేస్తే ఫలితం ఉంటుంది.
జీలకర్రను నీటిలో వేసి మరిగించి అనంతరం ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నోట్లో ఉండే చేదు పోతుంది. ఆకలి పెరుగుతుంది. ఆహారాన్ని మళ్లీ ఎప్పటిలా తింటారు. అలాగే పచ్చి మిర్చిని నేరుగా అలాగే తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. దీంతో రుచి కళికలు ఉత్తేజం చెందుతాయి. తిరిగి రుచి తెలుస్తుంది. నోట్లో ఉండే చేదు పోతుంది. అయితే కారం తినే వారు మాత్రమే దీన్ని పాటించాలి. అందరూ పచ్చి మిర్చిని నేరుగా తినలేరు. ఇక వెల్లుల్లి రెబ్బలతో కారం చేసి తిన్నట్లుగానే ఉల్లిపాయలతోనూ కారం చేసి తినవచ్చు. ఇలా తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. నోట్లో ఉండే చేదు త్వరగా తగ్గుతుంది.
మిరియాలతో రసం చేసి అన్నంలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నోట్లో చేదుగా ఉన్నవారు ఇలా తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. మిరియాల రసంతో అన్నం తింటే నోట్లో ఉండే చేదును తగ్గించుకోవచ్చు. అలాగే ఆకలి పెరుగుతుంది. ఆహారాన్ని ఎప్పటిలాగే తింటారు. జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక పండు మిరపకాయలు, పుంటి కూర వంటి వాటితో పచ్చళ్లను తయారు చేసి తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి కూడా నోట్లోని చేదును తగ్గించగలవు. నోటికి రుచి తెలిసేలా చేస్తాయి. అలాగే ఆల్ బుఖరా పండ్లను తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటిని తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా జ్వరం వచ్చాక నోట్లో ఉండే చేదును తగ్గించేందుకు లేదా పూర్తిగా తొలగించేందుకు ఈ చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.