Best Summer Fruits : మండే ఎండల్లో ఎంత నీరు తాగినా దాహార్తి తీరదు. వేసవిలో శరీరం హైడ్రేషన్ కోల్పోకుండా చూసుకోవడం కీలకం. నీరు అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అధికంగా నీరు ఉండే పండ్ల రసాలు, స్మూతీలు, స్నాక్స్ ను ఎంచుకోవడం మేలని సూచిస్తున్నారు. వేసవిలో సూపర్‌ఫ్రూట్‌గా వాటర్మెలన్ తీసుకోవచ్చు. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉండటంతో వేసవిలో ఈ పండును తీసుకోవడం పోషకాల పరంగా, వివిధ వ్యాధుల ముప్పును నివారించేందుకూ ఉపకరిస్తుంది. వాటర్‌మెలన్‌లో ఉండే ఆమినో యాసిడ్ రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది.
ఇక ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్, ఫైబర్, విటమిన్ సీ, మాంగనీస్, పోలేట్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీస్‌ను కూడా సమ్మర్ ఫ్రూట్స్‌లో భాగంగా తీసుకోవచ్చు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయి. ఇక సమ్మర్లో తీసుకోవాల్సిన ఐదు ఫ్రూట్స్‌ను పరిశీలిస్తే..
వాటర్మెలన్
స్ట్రాబెర్రీస్
ఆరెంజ్
మస్క్‌మెలన్
లిచి
Read More :
Nijjar Murder Case | నిజ్జార్ హత్య దర్యాపుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రుడో..!