Beetroot Health Benefits | బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దీని రుచి చాలా మందికి నచ్చదు. అలాగే బీట్రూట్ను ముట్టుకుంటే చాలు రంగు అంటుతుంది. కనుక దీన్ని తినేందుకు చాలా మంది అంత ఇష్టతను ప్రదర్శించరు. అయితే వాస్తవానికి బీట్రూట్ను సూపర్ ఫుడ్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ బీట్రూట్లో ఉంటాయి. కనుక బీట్రూట్ను తినాలని వారు సూచిస్తున్నారు. బీట్రూట్ను రోజూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. బీట్రూట్లో నైట్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. దీంతో రక్తనాళాలు వెడల్పుగా మారుతాయి. దీని వల్ల రక్త సరఫరాకు ఉండే అడ్డంకులు తొలగిపోయి రక్తం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది.
బీట్రూట్ను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక బీట్రూట్ను రోజూ తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. అలాగే తీవ్రమైన వ్యాధులైన క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బీట్రూట్ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువ. అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కనుక బీట్ రూట్‌ను తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు బీట్రూట్ను తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలను చాలా సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.
బీట్రూట్లో ఉండే నైట్రేట్లు మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. దీంతో ఇవి మెదడుకు రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు కచ్చితంగా బీట్రూట్ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
బీట్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే వ్యాధులను తగ్గిస్తుంది. దీంతో సీజనల్‌గా వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. బీట్రూట్ను రోజూ తినడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం కూడా అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. బీట్రూట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ బీట్రూట్ ను తింటే త్వరగా ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా బీట్రూట్ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.