బలమైన గాయాలు.. తీవ్ర అనారోగ్యాలు.. శరీరంలో కదలికలు తగ్గిపోవడం.. తదితర కారణాల వల్ల వెన్నునొప్పివెంటాడుతుంది. ఈ ఇబ్బ ంది ఏ వయసు వారికైనా రావచ్చు. వెన్ను కిందిభాగంలో నొప్పి మాత్రం వయసు పెరిగే కొద్దీ ఎక్కువవుతూ వస్తుంది. వెన్ను పైన, కింద.. ఎక్కడైనా నొప్పితలెత్తవచ్చు. జీవనశైలి మార్పులతో, నిపుణుల సలహాతో, ఆధునిక చికిత్సలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. కాకపోతే.. చాలా సందర్భాలలో నిర్లిప్తత, నిర్లక్ష్యమే వెన్ను సమస్యలను తీవ్రమైన రుగ్మతలుగా మార్చేస్తున్నాయి.
వెన్నునొప్పికి ప్రధాన కారణం వెన్నునొప్పి ఉందనే విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే. వెన్నుభాగంలో దీర్ఘకాలంపాటు నొప్పి కొనసాగితే.. అది భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వెన్నునొప్పిని.. తీవ్రమైనది, దీర్ఘకాలికంగా వేధించేది అంటూ వర్గీకరిస్తారు నిపుణులు. తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా మొదలై దాదాపు ఆరు వారాలపాటు వేధిస్తుంది. అదే దీర్ఘకాలికమైన నొప్పి కాలక్రమేణా వృద్ధి చెంది, మూడు నెలలపాటు కొనసాగి ఇతర సమస్యలకు కారణం అవుతుంది. చాలాసార్లు, వెన్నునొప్పి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండానే వస్తుంది. మూలాలను డాక్టర్లే గుర్తించ గలరు. శరీరానికి ఆయాసం, అసౌకర్యం కలిగించే భంగిమల్లో కూర్చోవడం, నిల్చోవడం లాంటివి సాధారణ కారణాలు. వెన్నునొప్పిలో అనేక రకాలు.
కండరాల స్ట్రెయిన్: ఒత్తిడికి గురైన కండరాలూ లిగమెంట్లు, కండరాలు కుంచించుకుపోవడం, డిస్కులు డ్యామేజీ కావడం, గాయాలు, పగుళ్లు .. వెన్నునొప్పికి దారితీస్తాయి. ఏ వస్తువునైనా ఎత్తాల్సిన పద్ధతిలో ఎత్తకపోవడం కూడా వెన్నులో ఒత్తిడికి (స్ట్రెయిన్) కారణం అవుతుంది. నొప్పికి దారితీస్తుంది.
డిస్కుల్లో వాపు లేదా పగుళ్లు: డిస్కులు వెన్ను
పాము ఎముకలకు రక్షణగా ఉంటాయి. వయసు పెరగడం, వెన్నులో ఇబ్బందులు, ఊబకాయం, ధూమపానం, గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్ను పదేపదే ఒత్తిడికి లోనుకావడం.. డిస్కుల సామర్థ్యం తగ్గిపోవడానికి కారణాలు. దీంతో అవి బయటికి చొచ్చుకు వస్తాయి. దీనినే బల్జింగ్ డిస్క్ (డిస్క్‌లో వాపు) అని పేర్కొంటారు. చికిత్స తీసుకోకపోతే వాపు వచ్చిన డిస్క్‌లో పగుళ్లు ఏర్పడతాయి. వెన్నునొప్పి వేధిస్తుంది. అది పిరుదులు, గజ్జల నుంచి క్రమంగా పాదాలకు పాకిపోతుంది.
ఆస్టియోపొరోసిస్: వెన్ను ఒత్తిడికి గురై నప్పుడు.. వెన్నులోని చిన్న ఎముకలతో సహా ఏ కీలు మీదైనా ప్రభావం చూపవచ్చు. కొన్నిసార్లు ఎముకలు గుల్లబారిపోవడానికి, పెళుసుగా మారడానికి కారణం అవుతుంది. ఎముకల్లో పగుళ్లు వెన్నునొప్పికి దారితీస్తాయి.
ఆర్థ్రయిటిస్: ఆస్టియో ఆర్థ్రయిటిస్ వెన్నుపాము కిందిభాగంలో, తుంటిలో కీళ్లలో సమస్యలకు కారణం అవుతుంది. ప్రధానంగా, కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఆర్థ్రయిటిస్ వృద్ధి చెందుతుంది. ఏమాత్రం కదిలినా నొప్పి వస్తుంది.
సయాటికా: కటివలయం, పిరుదులు, తొడ తదితర భాగాలకు గాయాలు, నొప్పి, డయా బెటిస్, ఎక్కువ కాలంపాటు కూర్చోవడం వల్లసయాటిక్ నాడి కుంచించుకుపోవడం లేదా లాగినట్లు అయిపోవడమే.. సయాటికా. ఈ రుగ్మతను భరించడమూ కష్టమే.
కిడ్నీ సమస్యలు: కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెకన్లు కూడా వెన్నునొప్పికి కారణం. వెన్నుపాములో స్కొలియోసిస్ (పక్క గూని) లాంటి అసాధారణమైన వంపు వెన్నునొప్పికి దారితీస్తుంది.
లక్షణాలు
వీపు భాగంలో ఎక్కడ అసౌకర్యంగా అని పించినా.. వెన్నునొప్పి ప్రాథమిక లక్షణంగానే భావించాలి. అయితే కొన్నిసార్లు ప్రభావితం చెందిన నాడులను బట్టి ఇతర భాగాలకూ నొప్పి విస్తరించవచ్చు. వెన్నునొప్పి సాధారణ సంకేతాలు… కండరాల నొప్పి, పొడుస్తున్నట్లుగా బాధ, బరువు ఎత్తుతున్నా, నిల్చున్నా, నడుస్తున్నా నొప్పిగా ఉండటం.
కారకాలు
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
తగినంత విశ్రాంతి తీసుకుంటే, చికిత్స అవసరం లేకుండానే వెన్నునొప్పి తగ్గిపోతుంది. అయితే.. బరువు తగ్గడం, జ్వరం, వీపులో మంట, వాపు, ఎంతకూ తగ్గని వెన్నునొప్పి, కాళ్ల కిందిభాగంలో నొప్పి, వెన్నుభాగానికి గాయాలు, మల మూత్ర విసర్జనలో అవాంతరాలు, జననాంగాల దగ్గర, మలద్వారం, పిరుదుల చుట్టూ తిమ్మిర్లతో కూడిన నొప్పి బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. చికిత్స కూడా ప్రారంభించాల్సిందే. ఈ దశలో వంటింటి వైద్యంతో ప్రయోజనం ఉండదు.
నిర్ధారణ
మీ వెన్నును బట్టి, మీరు కూర్చునే, నిల్చునే, నడిచే, కాళ్లను ఎత్తే సామర్థ్యాన్ని బట్టి డాక్టర్లు వెన్నునొప్పిని నిర్ధారిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్స్ రే, ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్, రక్త పరీక్షలు, నాడుల అధ్యయనం (ఎలెక్ట్రోమయోగ్రఫీ), ఎముకల స్కానింగ్ పరీక్షలు చేస్తారు.
ఇవీ పరిష్కారాలు..