Asthma control | ఆస్తమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దగ్గు,ఛాతి బిగిసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు నిద్రలో గురకపెట్టడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. సాధారణంగా కుటుంబలో ఎవరికైనా నాసల్ లేదా స్కిన్ అలెర్జీలు ఉన్న ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా వెంటనే ఆయాసం వస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అయితే, మన ఇండ్లల్లో దొరికే వస్తువులతో ఆస్తమాను నియంత్రికోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.