మరో ప్రాణం నిలబెట్టిన యాపిల్ వాచ్ : హార్ట్ బ్లాకేజ్పై మహిళను అలర్ట్ చేసిన స్మార్ట్‌వాచ్
లేటెస్ట్ టెక్నాలజీతో యూజర్ల ప్రాణాలను కాపాడే డివైజ్‌లను ప్రవేశపెట్టడంలో యాపిల్ ముందువరసలో నిలుస్తుంది. తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉదంతం వెలుగుచూసింది.
న్యూఢిల్లీ : లేటెస్ట్ టెక్నాలజీతో యూజర్ల ప్రాణాలను కాపాడే డివైజ్‌లను ప్రవేశపెట్టడంలో యాపిల్ ముందువరసలో నిలుస్తుంది. తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉదంతం వెలుగుచూసింది. క్రాష్ డిటెక్షన్ అలర్ట్, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ కాల్, హార్ట్ రేట్ మానిటర్ వంటివి యాపిల్ డివైజ్‌లకు డిమాండ్ పెంచడమే కాకుండా ప్రాణాపాయ పరిస్ధితులు తలెత్తినప్పుడు యూజర్లను అలర్ట్ చేస్తూ విలువైన ప్రాణాలను కాపాడుతున్నాయి.
మహిళలో గుర్తించని హార్ట్ బ్లాకేజ్‌ను యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ కనుగొని అలర్ట్ చేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంగ్లండ్‌లోని గేట్స్హెడ్కు చెందిన ఎలిన్ థామ్సన్‌కు ఆమె యాపిల్ వాచ్‌లో గుండె లయ తప్పుతోందని అలర్ట్స్ వచ్చాయి. ముందుజాగ్రత్తగా ఆమె కార్డియాలజిస్ట్‌ను సంప్రదించింది. దీంతో డాక్టర్ ఆమె గుండె లయను వారంపాటు ట్రాక్ చేసేందుకు హార్ట్ మానిటర్ అమర్చారు. ఈ క్రమంలో ఓ రోజు తాను నిద్రలేవగానే రెడ్ అలర్ట్ వచ్చిందని, డాక్టర్‌ను కలవాలని సూచించిందని ఎలిన్ చెప్పుకొచ్చారు.
ఆపై డాక్టర్‌ను కలిసి వాచ్ రికార్డు చేసిన రిజల్ట్స్‌ను చూపించానని తెలిపారు. ఓ రాత్రి ఎలిన్ నిద్రిస్తుండగా ఆమె గుండె 19 సెకండ్ల పాటు పనిచేయకపోవడంతో హార్ట్ మానిటర్ ఆస్పత్రికి అలర్ట్ పంపింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెలో బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వైద్యులు ఆమె పరిస్ధితి మెరుగుపడేందుకు పేస్ మేకర్ అమర్చారు. యాపిల్ వాచ్ తన ఆరోగ్య పరిస్ధితిని గుర్తించి సకాలంలో తనను అప్రమత్తం చేసిందని ఎలిన్ చెప్పారు. యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని, ఇప్పుడు తాను ఈ వాచ్‌ను విడువకుండా ధరిస్తున్నానని అన్నారు. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదనే ఆలోచన భయపెడుతున్నదని ఎలిన్ గుర్తుచేసుకున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

