Anjeer Fruits | మన శరీరానికి విస్తృత ప్రయోజనాలను అందించే ఆహారాల్లో అంజీర్ కూడా ఒకటి. ఇవి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు అంజీర్ పండ్ల రూపంలో, ఎండిన రూపంలో లభిస్తూ ఉంటాయి. తాజా అంజీర్ పండ్లు రుచిగా ఉన్నప్పటికీ వీటిని నిల్వ చేయడం కష్టం, ఇవి త్వరగా పాడవుతాయి. కనుక చాలా మంది ఎండిన అంజీర్ ను తీసుకుంటూ ఉంటారు. అంజీర్ పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అంజీర్ పండ్లల్లో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగు కదలికలను పెంచి మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అంజీర్ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పొటాషియంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె కండరాలపై భారాన్నితగ్గించడంలో కూడా సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. అలాంటి వారు అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ పండ్లల్లో క్యాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.
అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. చాలా మంది బరువు తగ్గడానికి డైట్స్ చేస్తూ ఉంటారు. దీని వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందవు. అలాంటి వారు అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వారికి కూడా అంజీర్ పండ్లు సహాయపడతాయి. వీటిలో గ్లైసెమిక్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా అంజీర్ చెట్ల ఆకులు వాటి సారాలు కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి.
అంజీర్ పండ్లల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు, కొవ్వు ఆమ్లాలు, కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంజీర్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల టి కణాల ఉత్పత్తి మెరుగుపడి శరీరం మొత్తం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవాలి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మనం కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో సహజ చక్కెరలు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. కొందరిలో ఈ పండ్లు అలర్జీని కూడా కలిగిస్తాయి. కనుక వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఈ విధంగా అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన మొత్తం శరీరానికి మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.