Animal Milk Alternatives | పాలను రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కనుకనే దీన్ని సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. అయితే కొందరు పుట్టుకతోనే పాలు అంటే అలర్జీలను కలిగి ఉంటారు. వారికి పాలు తాగితే పడవు. ఇంకా కొందరు పెరుగు తింటారు కానీ పాలు తాగరు. అయితే ఇలాంటి వారు పాలకు ప్రత్యామ్నాయంగా ఉండే ఇతర రకాలకు చెందిన పాలను తాగవచ్చు. ఇవి అలర్జీలను కలగజేయవు. పాలు అంటే అలర్జీ ఉన్నా, పాలను తాగడం ఇష్టం లేకపోయినా వృక్ష సంబంధ పాలను తాగవచ్చు. ఇవి కూడా పాలలాగే పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పాలకు ప్రత్యామ్నాయంగా ఏయే రకాల పాలను తాగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జంతు సంబంధ పాలు అంటే అలర్జీ ఉన్నవారు, ఆ పాలను తాగని వారు బాదంపాలను తాగవచ్చు. సాధారణ పాలలో ఉండే పోషకాలు ఈ పాలలో కూడా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పాలలోనూ అనేక రకాల పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్య నివేదికలు చెబుతున్న ప్రకారం బాదంపాలను ఒక కప్పు మోతాదులో సేవిస్తే 1 గ్రాము ప్రోటీన్లు, 3 గ్రాముల కొవ్వులు, 40 క్యాలరీల శక్తి లభిస్తాయి. కనుక జంతు పాలకు బాదంపాలను చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అలాగే జంతు సంబంధ పాలను తాగలేని వారు సోయా పాలను కూడా తాగవచ్చు. వీటిల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఒక కప్పు సోయా పాలను సేవిస్తే 131 క్యాలరీల శక్తి లభిస్తుంది. 4.3 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. ఈ పాలలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
సాధారణ పాలను తాగలేని వారు కొబ్బరి పాలను కూడా తాగవచ్చు. ఈ పాలను రోజూ చేసే వంటల్లోనూ వాడుకోవచ్చు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. కొబ్బరిపాలతో అనేక రకాల స్వీట్లను కూడా తయారు చేస్తారు. ఈ పాలలో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణ, శక్తిని అందిస్తాయి. అయితే కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నవారు కొబ్బరిపాలను తాగకూడదు. బాదంపాలు లేదా సోయాపాలను తాగాలి. ఓట్స్ తోనూ పాలను తయారు చేయవచ్చు. వీటిని రోజూ ఉదయం తింటే ఎంతో మేలు జరుగుతుంది. గుండెకు రక్షణ కవచంలా నిలుస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. ఒక కప్పు ఓట్స్‌ను తింటే 120 క్యాలరీల శక్తి లభిస్తుంది. 3 గ్రాముల ప్రోటీన్లు, 16 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్‌ను తినకూడదు.
బియ్యంతోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బియ్యం పాలు ఎంతో తియ్యగా ఉంటాయి. సాధారణ పాలు తాగని వారికి ఇవి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పాలలో సోడియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్‌తో పాలు తయారు చేసి తాగితే మంచిది. జీడిపప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితోనూ పాలను తయారు చేసి తాగవచ్చు. ఒక కప్పు జీడిపప్పు పాలను తాగితే 42 క్యాలరీల శక్తి లభిస్తుంది. జీడిపప్పులో కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ పాలను తాగకూడదు. ఇలా జంతు సంబంధ పాలు అంటే పడని వారు, ఆ పాలు అంటే ఇష్టం లేని వారు వృక్ష సంబంధ పదార్థాలతో తయారు చేసే పాలను తాగవచ్చు. దీంతో పోషకాలను, శక్తిని పొందవచ్చు.