భారతీయులు ఎంతో కాలం నుంచి ఆవాలను తమ వంటింటి దినుసుల్లో భాగంగా ఉపయోగిస్తున్నారు. పోపు వేయాలంటే.. ముందుగా ఎవరికైనా ఆవాలే గుర్తుకు వస్తాయి. తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో ఆవాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. అయితే వీటిని పొడి రూపంలో లేదా అలాగే నిత్యం తీసుకుంటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆవాలు రెగ్యులర్ వంటల్లో, పోపుల్లో ఉపయోగించడం వల్ల మంచి వాసన, టేస్ట్ ఉంటుంది. ఆవాలు సలాడ్స్ లో జోడించి తీసుకోవచ్చు. ఆవాలు పికెల్స్, చట్నీస్ లో జోడించి తీసుకోవచ్చు. ఆవాలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాలలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ లభిస్తుంది.
చల్లదనంతో కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాల్లో ఆవాలు గొప్పగా పని చేస్తాయి. ఇవి ఆమాన్ని కలిగించి వాతాన్ని క్రమపద్ధతిలోకి తెస్తాయి. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి.
వీటిలో ఉండే పోషకాలు మనకు వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయి.
శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనం ఉంటుంది.
ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వీటిలో ఉండే మ్యూసిలేజ్ అనే చిక్కటి పదార్థం విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.
ఆవాలలో ఉండే కాపర్, ఐరన్, మెగ్నిషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి.
ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆవాలలో విటమిన్ ఏ, సీ, కే లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. శరీర కణజాలాన్ని రక్షిస్తాయి.
ఫంగస్, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది.
ఆవాల నుంచి తీసిన నూనెలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది.
సోరియాసిస్‌ను కట్టడి చేయడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి.
వీటిలో ఉండే కెరోటిన్స్, లూటిన్, విటమిన్ ఏ, సీ, కే యాంటీఏజింగ్ గా పనిచేస్తాయి.
అయితే, ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మనకు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకోవడం ఉత్తమం. ఆవ పిండిని అతిగా తీసుకునే వారు కడుపునొప్పి, విరేచనాలతోపాటు గట్ ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో ఉండే గోయిట్రోజెన్ అనే పదార్థం జీవక్రియలను నియంత్రిస్తాయి. అందుకని మితంగా తీసుకుంటేనే మేలు జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.