Almonds For Diabetics | షుగర్ ఉందా..? అయితే బాదపప్పును తినండి.. ఎందుకంటే..?
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒకటి.
Almonds For Diabetics | డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులను తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. బాదంపప్పు ఒక సూపర్ ఫుడ్ అని దీనిలో విటమిన్ ఇ, ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దాదాపు 2 ఔన్సుల బాదంపప్పును తీసుకోవడం వల్ల 45 పాయింట్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని అలాగే ప్రీ డయాబెటిస్ ఉన్న వారు బాదంపప్పును తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని 2011 లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మెగ్నిషియం లోపం..
అలాగే డయాబెటిస్ తో బాధపడే వారిలో మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారిలో మూత్రం ద్వారా మెగ్నీషియం బయటకు వెళ్తుంది. దీంతో వారిలో మెగ్నీషియం లోపం తలెత్తుతుంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు బాదంపప్పును తీసుకోవడం వల్ల మెగ్నీషియంతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఇక డయాబెటిస్ తో బాధపడే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హార్ట్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. కనుక డయాబెటిస్ ఉన్నవారు బాదంపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అయితే బాదంపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక వీటిని మితంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు బరువు పెరగకుండా ఉంటారు, గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
లేబుల్స్ పరిశీలించాలి..
బాదంపప్పుతోపాటు మనకు బాదం పాలు, బాదం వెన్న వంటి ఉత్పత్తులు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే వీటిని తీసుకునే ముందు లేబుల్స్ ను పరిశీలించడం మంచిది. ఎందుకంటే వీటిలో చక్కెరలు, సోడియం వంటివి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బాదంపప్పును తృణ ధాన్యాలు, ఓట్స్ లేదా స్మూతీలతో కలిపి తీసుకోవచ్చు. వీటిని నానబెట్టి నేరుగా తీసుకోవడంతో పాటు పండ్లతో కలిపి తీసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వారు ఆహారంలో భాగంగా బాదంపప్పును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని , రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

