టోక్యో : నీరు లేకుండా ప్రాణికోటి నిలువలేదు. అయితే ఇక నీటిని తాగడంతో పాటు తినడం కూడా కండ్లకు కట్టనుంది. జపనీస్ డెజర్ట్ (Japanese Dessert) ఈ అసాధారణ, సంప్రదాయేతర ఆవిష్కరణకు వేదిక కానుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలే కాకుండా నోరూరించే వినూత్న రుచులకూ జపనీయులు అబ్బురపరిచే ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. నీటి చుక్క తరహాలో ఉండే రెయిన్‌డ్రాప్ కేక్‌ను జపనీయులు తయారుచేస్తున్నారు.
రెయిన్‌డ్రాప్ షేప్‌లో ఈ కేక్ కనిపిస్తూ నోరూరిస్తుంది. అయితే నీటితో నిండిఉండే ఈ వినూత్న కేక్ ప్రస్తుతం నెట్టింట హాట్ డిబేట్‌కు కేంద్ర బిందువైంది. ఈ రెయిన్‌డ్రాప్ కేక్‌కు జపాన్ చెఫ్‌లు వినూత్న క్రియేటివ్ టచ్ ఇస్తున్నారు. జపాన్ భాషలో మిజు షింజెన్ మోచిగా పిలిచే ది వాటర్ కేక్‌ను దక్షిణ జపనీస్ ఆల్ప్స్‌లోని కైకోమా పర్వతం నుండి సేకరించిన నీటితో తయారు చేస్తారు.
ఆల్ప్స్ నుండి వచ్చే నీరు సహజంగా అద్భుత రుచి కలిగిఉంటుందని చెబుతారు. ఈ కేక్‌లో వాడే కీలక పదార్ధం జున్నును నీటితో మిక్స్ చేస్తారు. రోస్టెడ్ సోయాబీన్ ఫ్లోర్, షుగరీ సిరప్‌తో కలిపి రెయిన్‌డ్రాప్ కేక్‌ను సర్వ్ చేస్తారు. గ్లూటెన్ ఫ్రీ, లో క్యాలరీ డైట్‌ను జపాన్‌లో అధికంగా ఇష్టపడటంతో ఈ కేక్‌కు క్రేజీ డిమాండ్ నెలకొంది.