పగటి కునుకు మనల్ని శారీరకంగా కంటే మానసికంగా రీచార్జి చేస్తుంది. ఈ భావన అనాదిగా మనకు అనుభవంలో ఉన్నదే. భారతదేశంలో, కొన్ని ఐరోపా దేశాల్లో పగటి కునుకును విశ్రాంతిగా పరిగణిస్తారు. వ్యవసాయ కుటుంబాల్లో పొద్దున పనిచేసి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు.
పగటిని కుటుంబంతో గడిపేస్తారు. మళ్లీ సాయంత్రానికి పొలానికి వెళ్లిపోతారు. ఇతర వృత్తులవారైనా ఇదే విధానాన్ని అనుసరిస్తారు.
అయితే, పగటి నిద్ర వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెపొందుతుంది. జాగరూకత పెరుగుతుంది. రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతేకాదు మన మూడ్‌ను ఉల్లాసంగా ఉంచుతుంది. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రించే వారికి పగటి కునుకు సహాయకారిగా ఉంటుంది. కాగా, కాళ్లు పైకెత్తి పడుకోవడం వల్ల రక్త ప్రసరణకు సహాయకారిగా ఉంటుందని, నిద్ర తొందరగా పడుతుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది.
ఎనిమిది నిమిషాల కునుకు మంచిదని, దీనివల్ల జబ్బుపడిన భావన కలగదని, విశ్రాంతిగా ఉంటుందని అమెరికా నావికాదళంలో విశ్రాంత అధికారి జోకో విల్లింక్ ‘ద గార్డియన్’ పత్రికలో రాసిన ఓ వ్యాసంలో వెల్లడించారు. పగటి కునుకు చాలా తక్కువ సమయం పాటే ఉంటుంది. ఇది నిద్రకు సబ్‌స్టిట్యూట్ మాత్రం కాదు. ఇవి స్వల్ప విరామాలు. మనల్ని మళ్లీ శక్తిమంతుల్ని చేస్తాయి. వీటితో తక్కువ స్లీపీగా అనిపిస్తుంది. పైగా పగటి కునుకు మనల్ని మరింత జాగరూకతతో ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
కాబట్టి పగటి నిద్ర లేదా పవర్ న్యాప్ అంటే మరింత సహనం, తక్కువ ఒత్తిడి, మంచి ప్రతిచర్యా సమయం, నేర్చుకోవడం పెరగడం, మరింత సామర్థ్యం, మంచి ఆరోగ్యం అంటారు దీపక్ నామ్‌జోషి ముంబైలోని క్రిటికేర్ ఏషియా మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్లో పల్మనాలజిస్ట్, కార్డియాలజీ వైద్యులు. ఆయన విన్స్టన్ చర్చిల్‌ను కోట్ చేస్తారు.. “మనం పొద్దున్నుంచి మధ్యరాత్రి వరకు పనిచేయడానికో, లేదా ఆడుకోవడానికి పుట్టలేదు. మనం మన రోజును, మన ప్రయాణాన్ని రెండుగా విభజించుకోవాలి” అని కోట్ చేస్తారు.
ప్రయోజనాలు