Kidney Health: ఈ ఐదు దురలవాట్లతో మీ కిడ్నీలు పాడైపోతాయ్!!
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్యర్ధాలు, అదనపు ద్రవ్యాలను సమర్థవంతంగా తొలగించలేవు. దీంతో డయాలసిస్ ద్వారా రక్తాన్ని వడకట్టి.. అవాంఛిత టాక్సిన్స్, అదనపు ద్రవ్యాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తారు. కిడ్నీలు 80 శాతం పాడయ్యేవరకు బాగానే పనిచేస్తాయి.
న్యూ ఢిల్లీ: శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్యర్ధాలు, అదనపు ద్రవ్యాలను సమర్థవంతంగా తొలగించలేవు. దీంతో డయాలసిస్ ద్వారా రక్తాన్ని వడకట్టి.. అవాంఛిత టాక్సిన్స్, అదనపు ద్రవ్యాలు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తారు. కిడ్నీలు 80 శాతం పాడయ్యేవరకు బాగానే పనిచేస్తాయి.
ధూమపానం, మద్యపానంలాంటి అనారోగ్య అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోతాయి. అధిక బరువు, ఇతరత్రా కారణాల వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. మనం సింపుల్‌గా తీసుకునే కొన్ని ప్రాథమిక, రోజువారీ అలవాట్ల వల్ల కూడా కిడ్నీలు పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని చాలా తక్కువ మంది వ్యక్తులు గ్రహించలేరని అంటున్నారు. మరి ఆ ఐదు చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.
1. తగినంత నీరు తాగకపోవడం..
తగినంత నీరు తాగకపోవడంతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. బీన్ ఆకారంలో ఉన్న అవయవాలకు తగిన మొత్తంలో నీరు లభించనప్పుడు, అవి వ్యర్థాలను తొలగించలేవు. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ వ్యాధులు వస్తాయి.
2. శరీరానికి ఎండ తగలకపోవడం..
సూర్యరశ్మిలో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన కిడ్నీలకు కీలకం. ఉదయం పూట ఎండలో విటమిన్ డీ ఉంటుంది. విటమిన్ డీ లోపంతో కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్ని నివారించేందుకు విటమిన్ బీ6 తీసుకోవడంతో పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
3. పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం..
వెన్ను, తలనొప్పి, అనేక ఇతర రకాల నొప్పులను తగ్గించుకునేందుకు చాలామంది రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. వీటిని ఎక్కువసార్లు వాడితే కిడ్నీ క్యాన్సర్ బారినపడే ప్రమాదముంది. అందుకే చిన్నపాటి నొప్పులకుకూడా పెయిన్ కిల్లర్స్ వాడొద్దు.
4. అతిగా ఆల్కహాల్ తాగడం..
పరిమిత పరిమాణంలో ఆల్కహాల్ శరీరానికి హానిచేయదు. కానీ, అతిగా తాగితే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజుకు నాలుగు కంటే ఎక్కువ పెగ్‌లు దీర్ఘకాలంపాటు తాగేవారిలో కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
5. అధికంగా ఉప్పు తీసుకోవడం..
అధిక ఉప్పు ప్రాణానికే ముప్పు. ఉప్పులో సోడియం ఉంటుంది. రోజులో అధికంగా ఉప్పు తీసుకుంటే అది హై బీపీకి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో హానికరం. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమేగాక గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

