గుండె ఆరోగ్యం కోసం షుగర్ పేషెంట్లు ఏం చేయాలి..?
Health tips: డయాబెటిస్ అదుపులో లేకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువట. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే
డయాబెటిస్ అదుపులో లేకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువట. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడం అత్యంత ముఖ్యమట. డయాబెటిస్ లేని వారితో పోల్చితే డయాబెటిస్ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని పలు పరిశోధనలు కూడా తేల్చాయి. కాబట్టి మన గుండెను కాపాడుకోవాలంటే షుగర్ వ్యాధిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో షుగర్‌ను అదుపు చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆరోగ్యకరమైన డైట్
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు తాము తీసుకోవాల్సిన, తీసుకోగూడని ఆహారాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ స్థాయిలు అధికంగా ఉండే ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం.
2. శారీరక వ్యాయామం
షుగర్ సమస్య ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. యోగాసనాలు వేయడం, ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
3. నిపుణుల పర్యవేక్షణలో ఔషధాల వాడకం
డయాబెటిక్స్ సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో ఔషధాలను సరిగ్గా వాడాలి. సమయపాలన, రెగ్యులారిటీ లేకుండా ఔషధాలను వినియోగించడంవల్ల సరైన ఫలితం ఉండదు.
4. బరువును అదుపులో ఉంచడం
షుగర్ పేషెంట్స్ కొందరు వెయిట్ లాస్ అయితే, మరి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఇవి రెండూ ప్రమాదకరమే. కాబట్టి బరువును అదుపులో పెట్టుకోకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది.
5. కండ్లను కాపాడుకోవడం
డయాబెటిస్ అదుపు తప్పితే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కంటి లోపలి భాగాలు దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.
6. మూత్ర పరీక్షలు
షుగర్ పేషెంట్లు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల ప్రొటీన్ లీకేజీ ఏమైనా ఉన్నదా, సీరమ్ క్రియాటినైన్ ఎంత ఉన్నది అనే వివరాలు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

