Special Report On Revanth Reddy Comments Over Free Electricity Power
రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని.. 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు.
రైతులు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పలు చోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి ఉరితీయగా, మరికొన్ని చోట్ల పిండ ప్రదానం చేశారు.
రైతులపై కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమైక్య పాలన నుంచి నేటి వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువుగా మారిందని దుమ్మెత్తి పోశారు.
కరెంటు అడిగితే కాల్చి చంపిన చంద్రబాబునాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి రైతులను ముంచేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను బయట పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేస్తుంటే..
రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను పాతరేస్తామని హెచ్చరించారు.
ఇది కాంగ్రెస్ విధానం కాకపోతే వెంటనే రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు.
సిద్దిపేటలో రైతులు, బీఆర్‌ఎస్ నేతల చేతిలో దహనం అవుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ దిష్టిబొమ్మ
కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు కోసం రైతుల పడిగాపులు నిత్యకృత్యం. అర్ధరాత్రి, అపరాత్రి వచ్చే కరెంటు కోసం పొలం దగ్గరే పడుకున్న ఓ రైతు కుటుంబం
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాత్రి పూట ఇచ్చే కరెంటు కోసం ప్రాణాలను పణంగా పెట్టి కటికచీకట్లో పొలాలకు వెళ్తున్న రైతులు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనిదీ ఫొటో
కంటోన్మెంట్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను వేలాడదీసి నిరసన వ్యక్తం చేస్తున్న టీఎస్‌ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ తదితరులు
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం రైతువేదిక ఎదుట రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు
సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో కాళేశ్వరం జలాలతో పారుతున్న కాలువలో రేవంత్‌రెడ్డి ఫొటోకు పిండ ప్రదానం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
హుజూరాబాద్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నినదిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, చిత్రంలో నిరసన తెలుపుతున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
వనపర్తిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు
వరంగల్ జిల్లా నర్సంపేటలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ నాయకులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్‌ఎస్ నాయకులు
వరంగల్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్‌ఎస్ శ్రేణులు
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు
సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రూరల్ మండల సర్పంచ్‌లు
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో రేవంత్‌రెడ్డి ఫొటోకు పిండ ప్రదానం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అంగడిరైచూర్ గ్రామంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు. చిత్రంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌రోడ్డులో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
ఓయూలో రేవంత్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన
రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నిరసిస్తూ బీర్ పూర్ మండలంలోని కోల్వ యీ గ్రామంలోని సబ్ స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం