Apps:
Follow us on:

Smriti Mandhana | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానం దక్కించుకున్న స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన..

1/19Smriti Mandhana | బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటలేకపోయారు.
2/19వరుణుడి దోబూచులాటతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లంతా విఫలమైన విషయం తెలిసిందే.
3/19దీంతో టీమిండియా 40 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో పరాజయం మూటగట్టుకుంది.
4/19వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో భారత జట్టుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.
5/19దీంతో తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన 6వ స్థానంలో నిలువగా..
6/19కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 8వ స్థానానికి పడిపోయింది.
7/19మందన ఖాతాలో 704 ర్యాంకింగ్‌ పాయింట్స్‌ ఉండగా.. హర్మన్‌ప్రీత్‌ 702 పాయింట్స్‌తో నిలిచింది.
8/19మంగళవారం 27వ పుట్టిన రోజు జరుపుకున్న స్మృతి గత ర్యాంకింగ్స్‌తో పోల్చుకుంటే ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుంది.
9/19ఆస్ట్రేలియా ప్లేయర్‌ బెత్‌ మూనీ (769) అగ్రస్థానంలో నిలువగా..
10/19నటాలియా స్కీవర్‌ (ఇంగ్లండ్‌; 763), చమరి ఆటపట్టు (శ్రీలంక; 734) వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంక్‌లు దక్కించుకున్నారు.
11/19బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకుంది.
12/19గత ర్యాంకింగ్స్‌తో పోల్చుకుంటే ఒక స్థానం కోల్పోయిన రాజేశ్వరి ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో ఉంటే..
13/19ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ 7వ ప్లేస్‌లో నిలిచింది.
14/19బౌలింగ్‌ విభాగంలో ఇంగ్లండ్‌ పేసర్‌ సోఫియా ఎకెల్ట్‌న్‌ 756 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.
15/19షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (దక్షిణాఫ్రికా; 722), జెస్‌ జాన్సెన్‌ (ఆస్ట్రేలియా; 702) టాప్‌-3లో ఉన్నారు.
16/19షబ్నమ్‌ ఇస్మాయిల్‌ (దక్షిణాఫ్రికా; 722), జెస్‌ జాన్సెన్‌ (ఆస్ట్రేలియా; 702) టాప్‌-3లో ఉన్నారు.
17/19( Photos : Instagram )
18/19( Photos : Instagram )
19/19( Photos : Instagram )