-ఈ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం 2005, ఏప్రిల్, 12న దేశవ్యాప్తంగా ప్రారంభించింది.
-గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించడం దీని ముఖ్యోద్దేశం.
-దీనిపై క్రియాశీల సాధికార సంఘాలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తాయి.
-నీరు, పారిశుద్ధ్యం, విద్య, పోషణ, ఆరోగ్యం వంటి తదితర మౌలిక వసతులపై పర్యవేక్షణ చర్యలు చేపడుతారు.
-లక్ష్యాలు : వచ్చే ఏడేండ్లలో శిశు మరణాలతో పాటు బాలింతల మరణ నిష్పత్తిని 50 శాతం తగ్గించడం.
-స్త్రీ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజా ఆరోగ్య సేవలను విస్తృతం చేయడం.
-స్థానిక, స్థానికేతర ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణ,నివారణ చర్యలు తీసుకోవడం.
-ప్రాథమిక ఆరోగ్య సేవలను సమగ్ర నిర్వహణ చేపట్టడం.
-ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించడం.
-మిషన్ లక్ష్యాలను సాధించడానికి ప్రజా ఆరోగ్య డెలివరీ సిస్టం కమ్యూనిటీ, మానవ వనరుల నిర్వహణ, కఠినమైన పర్యవేక్షణ, ప్రమాణాలను పటిష్టం చేయడం.
-సామాజిక ఆరోగ్య (ఆశ) కార్యకర్తలను నియమించి కమ్యూనిటీ హెల్త్ సిస్టమ్‌ను విస్తరించడం.
-జాతీయ ఆరోగ్యమిషన్‌లో ఇది ఉప కార్యక్రమంగా కొనసాగుతుంది.