భాస్కర్-1 (1979)
రష్యా వాహకనౌక
భాస్కర-1 మనదేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. దీనితర్వాత ఐఆర్ఎస్ ఉపగ్రహాల పరంపర మొదలైంది.
ఐఆర్ఎస్-1ఏ (1988)
వోస్టోక్ (రష్యా)
1988లో ఐఆర్ఎస్ ఉపగ్రహ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.
ఐఆర్ఎస్-1డీ (1997)
పీఎస్ఎల్వీ-సి1
రెండో తరానికి చెందిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం
ఓషన్‌శాట్-1 (1999)
పీఎస్ఎల్వీ-సి2
ప్రపంచంలో తొలిసారిగా సముద్ర పరిశోధనల కోసం ప్రయోగించిన ఉపగ్రహం. దీంతో సముద్ర అడుగు భాగాల్లో సైతం ఖనిజ, మత్స్య సంపదను గుర్తించవచ్చు. ఇందులో ఓషన్ కలర్ మానిటర్, మల్టీ స్పెక్ట్రల్ స్కానింగ్ మైక్రోవేవ్ రేడియో మీటర్ అనే రెండు పరికరాలను ఉంచారు.
రిసోర్స్‌శాట్-1 (2003)
పీఎస్ఎల్వీ-సి5
సహజ వనరులు, వ్యవసాయం, అటవీ, విపత్తుల నిర్వహణ మొదలైన అంశాల్లో దేశ సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో రూపొందించిన అత్యాధునికి ఉపగ్రహం.
కార్టోశాట్-1 (2005)
పీఎస్ఎల్వీ-సి6
భూమికి సంబంధించి మ్యాపులను తయారు చేయడానికి స్పష్టమైన ఛాయాచిత్రాలను పంపడానికి ఈ ఉపగ్రహం పంపారు.
కార్టోశాట్-2ఏ(2008)
పీఎస్ఎల్వీ-సి10
కార్టోశాట్తోపాటు ఇతర దేశాలకు చెందిన ఎనిమిది నానో శాటిలైట్స్‌ను ప్రయోగించారు.
చంద్రయాన్-1
పీఎస్ఎల్వీసీ-సి11(2008)
చంద్రుడిపై పరిశోధనల కోసం భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం
రిశాట్-2, అనుశాట్ (2009)
పీఎస్ఎల్వీ-సీ12
అన్ని వాతావరణ పరిస్థితులోల భూమికి సంబంధించిన ఫొటోలను స్పష్టంగా పంపుతుంది. విపత్తుల నిర్వహణలో ఇస్రో సామర్థ్యం పెంచేందుకు ఇది దోహదపడింది.
– అనుశాట్ తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన మైక్రోశాటిలైట్.
ఓషన్‌శాట్-2, ఆరు విదేశీ ఉపగ్రహాలు (2009)
పీఎస్ఎల్వీ-సీ14
సముద్ర పరిశోధన కోసం ఉద్దేశించిన రెండో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.
కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్(2010, జూలై)
పీఎస్ఎల్వీ-సీ15
భూమిపై మీటర్ పరిధిలో స్థలాలను స్పష్టంగా పరిశీలించవచ్చు. ఇది పట్టణ ప్రణాళికలో బాగా ఉపయోగపడుతుంది.
రిసోర్స్‌శాట్-2, యూత్‌శాట్, ఎక్సోశాట్ (2011, ఏప్రిల్)
పీఎస్ఎల్వీ-సీ16
యూత్శాట్ను భారత్- రష్యా సంయుక్తంగా రూపొందించాయి. ఎక్సోశాట్ సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.
మేఘా-ట్రోఫిక్స్, ఎస్‌ఆర్‌ఎంశాట్, జుగ్ను, వెసల్శాట్-1(2011)
పీఎస్ఎల్వీ-సీ18
మేఘా-ట్రోఫిక్స్ అనేది భారత్-ఫ్రాన్స్‌ల సంయుక్త ఉపగ్రహం. ఇది మేఘాల అధ్యయనం, వర్షసూచన, ఆర్థ్రత మొదలైన అంశాలను పరిశీలిస్తుంది.
– ఎస్‌ఆర్‌ఎంశాట్ ఉపగ్రహాన్ని ఎస్ఆర్ఎం అధ్యాపకులు, విద్యార్థులు కలిసి గ్లోబల్ వార్మింగ్ ప్రభావ పరిశోధనల కోసం తయారు చేశారు.
– జుగ్ను శాటిలైట్‌ను ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఇస్రో
ఆధ్వర్యంలో తయారు చేశారు.
– వెసల్శాట్-1 లక్సెంబర్గ్‌కు చెందిన శాటిలైట్.
రిశాట్-1 (2012)
పీఎస్ఎల్వీ-సీ19
రిశాట్-1 అనేది భూపరిశోధన కోసం ఇస్రో రూపొందించిన శక్తిమంతమైన రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. చీకట్లో కూడా భూమికి సంబంధించిన ఛాయాచిత్రాలను స్పష్టంగా పంపించే పరిజ్ఞానంతో రూపొందించారు.
స్పాట్-06, ప్రాయిటర్
పీఎస్ఎల్వీ-సీ21
భూమికి 694కి.మీ.ల ఎత్తున సూర్యావర్తన ధ్రువ కక్ష్యలో ఉంటుంది. భూమి పరిశోధనకు ఉపయోగపడుతుంది.