Apps:
Follow us on:

Photo Story | విపత్తులో వెన్నంటి… జనంతో భుజం కలిపి.. వరద సహాయక చర్యలు

1/36ఖమ్మం రూరల్‌ మండలంలోని కేబీఆర్‌ కాలనీలోకి వరదనీరు వచ్చి చేరింది. పోలీసులు పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓ చిన్నారిని భుజంపై ఎత్తుకొని తీసుకొస్తున్న రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి
2/36నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు గురువారం వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు 16 గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలారు. ఒక దశలో ప్రాజెక్టు పైనుంచి ఉగ్రరూపంతో పొంగిపొర్లుతున్న వరదనీరు
3/36వరంగల్‌లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నన్నపునేని, మేయర్‌ సుధారాణి
4/36సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో వరదముంపులో చిక్కుకున్న ఓ వృద్ధురాలిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు
5/36భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలో వరద ముంపుతో సజ్జలమీదికి ఎక్కిన మోరంచపల్లి గ్రామస్థులు
6/36మహబూబ్‌నగర్‌లోని మినీట్యాంక్‌బండ్‌ వద్ద పెద్దచెరువులో నిలిచిన వర్షపునీటిని పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
7/36జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌
8/36ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకుని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయంతో  సురక్షితంగా బయటపడ్డ చిన్నారిని ఎత్తుకున్న మంత్రి అజయ్‌కుమార్‌
9/36కడెం ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌
10/36కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి వద్ద వరదను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
11/36హుస్సేన్‌సాగర్‌ వద్ద  వరద పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి కే తారకరామారావు
12/36కడెంలోని నీటిపారుదలశాఖ విశ్రాంతి భవనంలో వరద బాధితులకు భోజనాలు పెడుతున్న అధికారులు
13/36బాల్కొండ నియోజకవర్గంలో వరద పరిస్థితిని పరిశీలిస్తున్న మంత్రి వేముల
14/36సహాయక చర్యల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ జ్యోతి, కలెక్టర్‌ భవేష్‌, ఎస్పీ కరుణాకర్‌
15/36ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడుతున్న నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా
16/36కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు పడ్డ బుంగను పూడ్చేందుకు ఇసుకను బస్తాల్లో నింపుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
17/36ఖమ్మం జిల్లా  జలగంనగర్‌లో నీటమునిగిన ఇండ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు
18/36వరంగల్‌ హంటర్‌ రోడ్డులో  బాధితుల కోసం సిద్ధం చేసిన ఆహారాన్ని బోటులో తరలిస్తున్న సహాయక సిబ్బంది
19/36భారీ వర్షాలకు హనుమకొండలోని గోపాల్‌పూర్‌ ప్రాంతం నీట మునిగింది. కాలనీలోని రోడ్లన్నీ నీళ్లతో నిండిపోగా, రాకపోకలకు అవకాశం లేకుండాపోయింది.
20/36మోరంచపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌
21/36హనుమకొండలోని నయీంనగర్‌ నాలా ఉప్పొంగింది. రోడ్డుపై భారీగా నీళ్లు చేరి, దుకాణ సముదాయాల్లోకి వెళ్లాయి. వరద ఉధృతికి కొట్టుకపోతున్న అంబులెన్స్‌, కారు.
22/36ములుగు జిల్లా గోవిందరావుపేట దయ్యాలవాగు పొంగింది. దీంతో వాగు సమీపంలోని ఇండ్లు నీట మునిగాయి
23/36ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గుండ్లవాగు ఉధృతికి కొట్టుకొచ్చిన కారు
24/36ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో వరద నీటిలో కూలిన ఇల్లు
25/36మోరంచపల్లి గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరడంతో వరద ఉధృతికి తట్టుకోలేక చెట్లు, లారీపై ఎక్కి ప్రాణాలు కాపాడుకుకున్న గ్రామస్థులు
26/36ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో మునిగిన అమ్మవార్ల గద్దెలు
27/36మోరంచపల్లిలో పడవలో ప్రజలను తీసుకెళ్తున్న రెస్క్యూ బృందాలు
28/36వరంగల్‌లోని హంటర్‌రోడ్‌ ప్రజలను ట్రాక్టర్‌లో తరలిస్తున్న స్థానికులు
29/36జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయిన రహదారి
30/36రాజన్న సిరిసిల్ల అర్బన్‌ మండలం చిన్నబోనాల చెరువు కట్ట తెగడంతో సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌ రోడ్లపైకి వచ్చిన వరద నీరు
31/36ఖమ్మం నగరంలోని మోతినగర్‌లో బాధితులను నాటుపడవద్వారా తరలిస్తున్న సీపీ విష్ణు వారియర్‌
32/36భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో సున్నంబట్టి గ్రామానికి పడవపై వెళ్తున్న వైద్య సిబ్బంది
33/36సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో జలమయమైన రోడ్డు
34/36సిరిసిల్ల పట్టణం వెంకంపేటలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్‌మహాజన్‌
35/36గురువారం నిజామాబాద్‌ జిల్లాలోని పోచంపాడ్‌ వద్ద శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు
36/36గురువారం ఎగువ నుంచి వస్తున్న వరదతో జలకళను సంతరించుకున్న గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (డ్రోన్‌ వ్యూ)