Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
Actresses Radhika Apte | ప్రముఖ నటీమణులు కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'అక్క' (Akka).
Actresses Radhika Apte | ప్రముఖ నటీమణులు కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘అక్క’ (Akka). నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వీరిద్దరూ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమోషన్లలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఈ ఇద్దరు తారలు తమ వ్యక్తిగత నమ్మకాలు, దేవుడు, మతం పట్ల తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా రిపోర్టర్ మీరు దేవుడిని నమ్ముతారా? అని అడగ్గా, కీర్తి సురేష్ స్పందిస్తూ తాను దేవుడిని నమ్ముతానని తెలిపారు. నేను దేవుడిని నమ్ముతాను, ఈ సృష్టి వెనుక ఏదో ఒక శక్తి ఉందని నేను భావిస్తాను. కానీ కఠినమైన మతపరమైన ఆచారాలను పాటించే వ్యక్తిని మాత్రం కాదు అని కీర్తి సురేష్ తన మనసులోని మాటను వెల్లడించారు.
మరోవైపు ఇదే ప్రశ్నకు రాధికా ఆప్టే చాలా ఆసక్తికరమైన కోణంలో సమాధానం ఇచ్చారు. తాను దేవుడిని నమ్మనని రాధికా ఆప్టే తేల్చిచెప్పారు. “నేను దేవుడిని నమ్మను, కానీ ప్రకృతిని మాత్రం అత్యున్నత శక్తిగా నమ్ముతాను. మనుషులు విగ్రహాలను పూజించడం కంటే, మనకు ప్రాణం పోస్తున్న ప్రకృతిని ఆరాధిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అని రాధికా చెప్పుకోచ్చారు. ఇలా ఒకే వేదికపై ప్రమోషన్లలో పాల్గొన్న ఇద్దరు ప్రముఖ నాయికలు దేవుడు, ప్రకృతి మరియు మతం పట్ల తమకంటూ ప్రత్యేకమైన దృక్పథాలు ఉన్నాయని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
Reporter – do you believe in God?
Keerthy Suresh – yes i believe in God , I believe there is some kind of power , I’m devotional but I’m not religious
Radhika Apte – I don’t believe in God, I believe nature is the higher power and i wish people worship nature over some idols https://t.co/IZauMxqfW5
— Filmy_Duniya (@ayaanpanda1) October 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
Kumar Sangakkara | క్రికెటర్ సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం.. ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు..!
Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

