Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
Shrasti Verma | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో మాట్లాడటంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై శ్రేష్టి వర్మ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Shrasti Verma | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి జానీ మాస్టర్ ఓ డ్యాన్స్ షోలో మాట్లాడటంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై శ్రేష్టి వర్మ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జానీ మాస్టర్ ప్రస్తుతం ‘ఢీ’ డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని, ఓ మహిళా డ్యాన్సర్ తనను ‘జీరో జీరో’ అని పేర్కొందని అన్నారు. తాను సరైనవాడిని అయినప్పుడు ఇతరులు ఏమనుకుంటే తనకెందుకని అన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో శ్రేష్టి వర్మ స్పందించారు. జానీ మాస్టర్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న శ్రేష్టి వర్మ.. ‘‘నిజం వెలుగులోకి వచ్చినప్పుడు, అపరాధభావం ఉన్న వ్యక్తి మరింత గట్టిగా మాట్లాడతాడు’’ అనే కామెంట్‌ని జత చేశారు. అనంతరం మరో పోస్టులో జానీ మాస్టర్‌ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజంగా ఇబ్బంది పెట్టకపోతే వాటి గురించి బహిరంగ వేదికపై ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా మాట్లాడితే, ఆమె మాటలను ప్రశ్నించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
అంతేకాకుండా, తనకు మద్దతుగా నిలుస్తున్నవారిని వ్యక్తిగతంగా సంప్రదించి మాట్లాడకుండా చేయడానికి జానీ మాస్టర్‌కు హక్కు లేదని శ్రేష్టి వర్మ పేర్కొన్నారు. తనకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి తాను చేరుకున్నానని, తన తరఫున నిలబడే వారిని కూడా అడ్డుకోకూడదని వ్యాఖ్యానించారు. తాను దాదాపు నాలుగేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని శ్రేష్టి వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడి, తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. తన కథను తానే చెప్పుకునే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ మూయించలేరని స్పష్టం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ వ్యాఖ్యలు, వాటికి శ్రేష్టి వర్మ ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
Job Notification | రాష్ట్రంలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

