Kumar Sangakkara | క్రికెటర్ సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం.. ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు..!
Kumar Sangakkara | శ్రీలంక మాజీ క్రికెటర్ (Srilanka Former Cricketer) కుమార సంగక్కర (Kumar Sangakkara) కు ఐర్లాండ్ (Irland) లో చేదు అనుభవం ఎదురైంది. తనతోపాటు తన కుటుంబంపై వివక్షపూరితంగా వ్యవహరించారంటూ ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్ (Ran Air Airlines) సిబ్బందిపై సంగక్కర తీవ్ర విమర్శలు చేశారు. డబ్లిన్ (Dublin) లోని ర్యాన్ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి తనకు వివక్ష ఎదురైందని ఆయన సోషల్ మీడియా (Social Media) ద్వారా తెలిపారు.
Kumar Sangakkara : శ్రీలంక మాజీ క్రికెటర్ (Srilanka Former Cricketer) కుమార సంగక్కర (Kumar Sangakkara) కు ఐర్లాండ్ (Irland) లో చేదు అనుభవం ఎదురైంది. తనతోపాటు తన కుటుంబంపై వివక్షపూరితంగా వ్యవహరించారంటూ ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్ (Ran Air Airlines) సిబ్బందిపై సంగక్కర తీవ్ర విమర్శలు చేశారు. డబ్లిన్ (Dublin) లోని ర్యాన్ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి తనకు వివక్ష ఎదురైందని ఆయన సోషల్ మీడియా (Social Media) ద్వారా తెలిపారు. తనకు, తన కుటుంబానికి ఇప్పుడే అలాంటి పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.
‘డబ్లిన్‌లోని ర్యాన్ఎయిర్ గేట్ సిబ్బంది నుంచి ఎవరైనా వివక్షను ఎదుర్కొన్నారా..? నాకు, నా కుటుంబానికి ఇప్పుడే అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిబ్బంది మాట్లాడిన తీరు, విధానాలను సరిగ్గా పాటించకపోవడం, బెదిరింపు ధోరణి ఏ ప్రయాణికుడికీ ఆమోదయోగ్యం కాదు. డబ్లిన్‌లో మొదటిసారి మాకు చేదు అనుభవం ఎదురైంది’ అని కుమార సంగక్కర తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టుపై సాఫ్ట్వేర్ సంస్థ డబ్ల్యూఎస్ఓ2 సీఈవో సంజీవ స్పందించారు. ‘వివక్ష అనేది పాశ్చాత్య దేశాల్లో ఓ భాగం’ అని విమర్శిస్తూ పోస్టు చేశారు. ఆ వివక్షను ఎదుర్కొనేటప్పుడు కలిగే అనుభవం దారుణంగా ఉంటుందని సంగక్కర సమాధానమిచ్చాడు. కాగా ఐర్లాండ్‌లోని కౌంటీ అయిన డబ్లిన్‌కు చెందిన ర్యాన్ఎయిర్ యూరప్‌లోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ. అలాంటి సంస్థలో సిబ్బంది తీరు ఈ విధంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumar Sangakkara | క్రికెటర్ సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం.. ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు..!
Shrasti Verma | జానీ మాస్టర్‌కు శ్రేష్టి వర్మ కౌంటర్.. ‘నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నోరు మూయించలేరు!’
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పత్తి రైతుల ఆందోళన : వీడియో
తెలంగాణలో మొదలైన నీటి కష్టాలు.. మంత్రి ఇలాఖాలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన : వీడియో
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ కార్డు ఖరీదు ఎంతో తెలుసా.. ఒక్కో బాక్స్ ధర రూ.20 వేల వరకు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

