
వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి విపత్తు రాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం తామున్నామని అభయమిస్తున్నది.

27 బృందాలతో 500 మంది డీఆర్‌ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉంటున్నారు.

ఫిర్యాదులు అందిన వెంటనే చకచకా పరిష్కారాలు చూపుతూ పౌరుల మన్ననలు అందుకుంటోంది.

మంగళవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 31 ఫిర్యాదులకు పరిష్కారాలు చూపారు. ఈ అత్యవసర సేవలను మరింత వేగంగా అందించేందుకు తాజాగా మొబైల్ కంట్రోల్ రూం (కస్టమైజ్డ్ ట్రక్)ను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఈ నెల 31లోపు ఆసక్తి గల ఏజెన్సీ నుంచి ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) సమర్పించాలని టెండర్లను ఆహ్వానించారు. మరోవైపు నగర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాబోయే రెండు రోజులు అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు భారీ వర్షాలకు నగరంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని, అత్యవసరమైతేనే సిబ్బందికి సెలవులు ఇవ్వాలని చెప్పారు.

ఇదిలా ఉంటే జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతున్నది.

హిమాయత్‌సాగర్‌లో నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతుండగా, ఉస్మాన్‌సాగర్‌లో గరిష్ట స్థాయి నీటి మట్టానికి ఇంకా రెండున్నర అడుగుల మేర నీరు రావాల్సి ఉన్నది.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో రికార్డుస్థాయిలో కురిసిన వానలకు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో రికార్డుస్థాయిలో కురిసిన వానలకు కొట్టుకుపోయిన రహదారి

సమైక్య పాలనలో కరువు జిల్లాగా, ఉపాధి కోసం వలసలకు నెలవుగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా.. నేడు ఇతర రాష్ట్ర కూలీలకు ఉపాధి ఖిల్లాగా మారింది. స్వరాష్ట్రం వచ్చాక సాగు నీటి రంగంపై సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవతో నేడు పచ్చని మాగాణమైంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మూడుమల్ గ్రామంలో నాట్లు వేస్తున్న బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ కూలీలు

భారీ వర్షాల ధాటికి దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ర్టాల్లో జన జీవనం స్తంభించిపోయింది. మంగళవారం కుండపోత వానకు నదులు, వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. యమున ఉపనది హిండన్ ఉగ్రరూపం దాల్చటంతో గ్రేటర్ నోయిడాకు సమీపంలో ఎకోటేక్-3 వద్ద దాదాపు 300కు పైగా కార్లు నీటమునిగాయి. ఘజియాబాద్‌లో ఇద్దరు బాలురు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. హిమాచల్‌లో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. పంట పొలాలన్నీ నీట మునిగిపోగా, వందలాది పశువులు మరణించాయి.

మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మత్తడి దుంకుతున్న పందిల్ల చెక్‌డ్యామ్ కింద చేపలు పడుతున్న స్థానికులు, మత్స్యకారులు

మత్తడి దుంకుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలంలోని కోటిపల్లి ప్రాజెక్టు

జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద దృతంగా ప్రవహిస్తున్న గోదావరి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్‌రావుపేట శివారులో మత్తడి దుంకుతున్న రాళ్లవాగు ప్రాజెక్టు

భారీ వర్షానికి వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ అంతర్గత రోడ్డుపై కూలిన చెట్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులో మూల వాగులో చికుకున్న మారుతి అనే వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తున్న పోలీసులు

వరంగల్‌లో నీట మునిగిన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి వడ్డెర కాలనీ సమీపంలో దిగబడిన 108 అంబులెన్స్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలో అలుగు పోస్తున్న పాలేరు జలాశయం

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అలుగు పారుతున్న లక్నాపూర్ చెరువు

బౌద్ధనగర్‌లోవరద నీటిని తొలగిస్తున్నసిబ్బంది

ఎల్బీనగర్‌లో రహదారిపై గుంతలకు మరమ్మతులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఐకియా ఎక్స్ రోడ్‌లో వర్షంలోనూ సాఫీగా వెళ్తున్న వాహనాలు

హుస్సేన్ సాగర్ తూముల నుంచి దిగువకు ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

హైదర్‌గూడలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణ

గత కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి.

మంగళవారం సాయంత్రం రసూల్‌పురాలో గొడుగులతో రోడ్డు దాటుతున్న పాదచారులు