HomeGeneralDevelopment Of Hyderabad Under Trs Government
Photo Story | విశ్వనగరంగా హైదరాబాద్.. అంతర్జాతీయ ప్రమాణాలు.. అభివృద్ధి పరుగులు
Development Of Hyderabad Under Trs Government
2/16
స్వరాష్ట్ర పాలనలో హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నది.
3/16
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో విశ్వనగరాల సరసన చేరింది.శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో మౌలిక వసతుల కల్పన,
4/16
అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలోనే ఏకంగా రూ. 88 వేల కోట్లు ఖర్చు చేసింది.
5/16
కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో నగరాభివృద్ధికి రూ. 22 వేల కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేండ్ల కాలంలో నాలుగింతలు ఎక్కువ ఖర్చు చేసింది.
6/16
పదేండ్ల ప్రస్థానంలోనే వందేండ్ల ప్రగతి సాధించి భాగ్యనగరాన్ని విశ్వవిజేతగా నిలిపింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర బిందువుగా మార్చింది.
7/16
ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి.
8/16
ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి.
9/16
గత పాలకుల్లో అదే లోపించింది. అందుకే 2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాలంలో నగరాభివృద్ధికి అప్పటి ప్రభుత్వం రూ.22వేల కోట్ల పైచిలుకు ఖర్చు పెడితే..
10/16
కేవలం ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా దాదాపు రూ.88వేల కోట్ల వరకు వెచ్చించింది.
11/16
ఫలితంగానే.. అనేక రంగాల్లో దేశంలోని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి భారీ ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది.
12/16
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసిన 2014-24 పదేండ్ల ప్రగతి నివేదికలో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి.
13/16
వరద నీటి ముంపును శాశ్వతంగా తొలగించడమే లక్ష్యంగా రూ.985.45కోట్లతో ఎస్ఎన్డీపీ పథకానికి శ్రీకారం చుట్టారు.
14/16
58 ప్రాజెక్టులు తీసుకోగా.. 90శాతం మేర తొలి విడత పనులు పూర్తి చేసుకొని విడతల వారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
15/16
నగరం నలువైపులా నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల శుద్ధికి సీఅండ్డీ ప్లాంట్లను ఏర్పాటు చేసి రోజుకు 2వేల మెట్రిక్ టన్నులను శుద్ధి చేసి పునర్ వినియోగంలోకి తీసుకువచ్చారు.
16/16
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో 111 లోకేషన్లతో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. 60వేలకు పైగా ఇండ్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల కొల్లూరు అతిపెద్ద టౌన్షిప్ 15,660 ఇండ్ల భారీ గృహ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. త్వరలో లబ్ధిదారులకు ఈ ఇండ్లను కేటాయించనున్నారు.