HomeGalleryWhat Food To Eat And What To Avoid In This Hot Summer Season
Summer | సమ్మర్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? వేటిని తినకూడదు?
Eat Food
2/10
వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ మార్పునకు అనుగుణంగా ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలి. శరీరానికి తేమనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు, పండ్లు తీసుకోవాలి. దూరం పెట్టాల్సినవీ ఉన్నాయి.
3/10
శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుతమైన పానీయం. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ. మజ్జిగలోని ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలుచేస్తాయి.
4/10
మొలకలు ప్రొటీన్స్, ఫైబర్ గనులు. తేలికగా జీర్ణమవుతాయి. వేడి వాతావరణంలో మంచి ఆహారం
5/10
: గోధుమలు, బియ్యానికి బదులుగా రాగి, జొన్నలు, క్వినోవా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఆరురెట్లు ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయులను పెంచే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఎండల్లో నిస్సత్తువ ఆవరించదు. నిలకడైన శక్తి లభిస్తుంది.
6/10
తర్బూజ, కర్బూజ, పీచ్, బెర్రీ, అంగూర్ పండ్లు శరీరాన్ని తేమగా ఉంచుతాయి. డీహైడ్రేషన్ దుష్ప్రభావాల నుంచి కాపాడతాయి.
7/10
కొబ్బరినీళ్లలో ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షిస్తాయి.
8/10
డ్రై ఫ్రూట్స్ ఒంట్లో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మొటిమలు, దద్దుర్లు వస్తాయి. రాత్రంతా నీళ్లలో నానబెట్టి తింటే మాత్రం మంచిదే.
9/10
మాంసాహారాలు వేడిని పెంచుతాయి. సాధ్యమైనంత వరకు నాన్‌వెజ్ తగ్గించాలి. వేడి వాతావరణంలో మాంసం త్వరగా కుళ్లిపోతుంది. విషతుల్యంగానూ మారవచ్చు.
10/10
కాఫీ, టీ రెండిట్లోనూ కెఫీన్ అధికం. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మోతాదుకు మించితే శరీరంలో వేడి పెరుగుతుంది. అది నిద్రకు చేటు చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని పెంచుతుంది. తేన్పులు ఎక్కువగా వస్తాయి.