Vemulawada | వేములవాడ టౌన్ : కార్తీకమాసం మూడోవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం, భీమేశ్వరాలయం ప్రాంగణాల్లో సందడి నెలకొంది.
3/21
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి వచ్చిన భక్తులతో వేములవాడ పురవీధులు కిటకిటలాడాయి.
4/21
వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడెమొక్కు తీర్చుకోవడం కోసం క్యూలైన్లో బారులు తీరారు.
5/21
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రాజన్న భక్తులు దర్శనాలకు భక్తులు చాలా ఇబ్బందులుపడ్డారు. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటలపాటు క్యూలైన్లో నిలబడ్డామని కొందరు భక్తులు వాపోయారు.
6/21
రాజన్న ఆలయంలో ఇటు భీమేశ్వరాలయాల వద్ద కూడా భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో భక్తులు కోడెమొక్కులు, కల్యాణాల మొక్కులు, అన్నపూజలు, గండదీపం మొక్కులు నిర్వహించుకున్నారు.
7/21
కార్తీకమాసం సందర్భంగా భక్తులు రాజన్న, భీమేశ్వరాలయాల ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించుకున్నారు. రాజన్న ఆలయం, భీమేశ్వరాలయాల పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది.
8/21
రాజన్న అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయాల వద్ద భక్తులు క్యూలైన్లో దర్శనం కోసం నిలబడి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీకమాసం సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు.
9/21
భీమేశ్వరాలయంలో రాత్రి ఆలయ అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో భక్తులు అధికంగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరుగకుండా వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో గట్టిపోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.