సూపర్ స్టార్ రజనీకాంత్ గత నెల 19న తన భార్య ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రత్యేక విమానంలో ఆయన యూఎస్‌కి వెళ్లగా, అక్కడ మయో క్లినికల్ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలలోను ఎలాంటి సమస్యలు లేవని తేలతడంతో రజనీకాంత్ తిరిగి చెన్నైకి వచ్చారు.
గురువారం వేకువజామున రజనీకాంత్ చెన్నైకు వచ్చినట్టు తెలుస్తుండగా, ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికినట్టు సమాచారం. ఇక కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత రజనీకాంత్ తన కూతురు సౌందర్య డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే తనకు చివరి సినిమా అవుతుందని తలైవా భావిస్తున్నాడట. ఇక ఇటీవల శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తె చిత్రంలో నటించగా, సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.