వేగానికి కళ్లెం..

- స్పీడ్ లేజర్‌గన్‌తో వేగం లెక్కింపు
- హైవేపై 80 కిలోమీటర్లు మించితే ఫైన్
- గతేడాది జోగుళాంబగద్వాలలో 25,536 వాహనాలకు చలాన్లు
- రూ.2.64 లక్షల జరిమానా విధింపు
గద్వాల న్యూటౌన్, జనవరి 6 : అజాగ్రత్త, చిన్నపాటి నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నియంత్రణ లేని వేగంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి వేగానికి కళ్లెం వేస్తున్నారు. వేగ నిర్ధారణ కోసం జాతీయ రహదారిపై స్పీడ్ లేజర్‌గన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా వాహనదారులు లెక్కచేయకుండా పరిమితికి మించి వేగంగా వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది అతివేగంగా వెళ్లిన 25,536 వాహనాలకు రూ.2,64,29,760 జరిమానా విధించారు.
లిమిట్ దాటితే అంతే..
అతివేగంగా వెళ్లే వాహనాల దూకుడును తగ్గించేందుకు పోలీస్‌శాఖ రాష్ట్ర వ్యాప్తంగా స్పీడ్ లేజర్‌గన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాల వేగాన్ని కచ్చితత్వంతో సేకరిస్తున్నారు. జాతీయ రహదారిపై 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంగా వచ్చే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. జిల్లాలో రెండు స్పీడ్ లేజర్గన్లను వినియోగిస్తున్నారు. వేగంగా వచ్చే వాహనానికి సంబంధించిన ఫొటో, వాహనం నెంబర్ ప్లేట్ వివరాలను ఆటోమెటిక్‌గా సర్వర్‌కు ఈ పరికరం పంపిస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి నుంచి అలంపూర్ హైవే జాతీయ రహదారి నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విశాలంగా ఉండడంతో వాహనాదారులు నిర్ణీత వేగాన్ని మించి వెళ్తుంటారు. వీటికి స్పీడ్ లేజర్‌గన్‌తో కళ్లెం వేస్తున్నారు.
స్పీడ్ లేజర్‌గన్‌తో వేగం నియంత్రణ..
రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల వేగం నియంత్రించేందుకు పోలీస్‌శాఖ శ్రీకారం చుట్టింది. హైవేపై స్పీడ్ లేజర్‌గన్‌తో చలాన్లు విధిస్తున్నాం. పరిమితికి మించి వాహనాలను వేగంగా నడిపితే జరిమానాతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తాం. 2019తో పోలిస్తే గతేడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. వాహనదారులు, ప్రయాకులు క్షేమంగా గమ్యస్థ్ధానాలకు చేరుకోవడమే మా లక్ష్యం.
- రంజన్ రతన్ కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!