ఆదివారం 01 నవంబర్ 2020
Gadwal - Oct 02, 2020 , 02:57:07

అదనపు కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలి

అదనపు కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలి

  •  వీసీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

గద్వాల  : గ్రామాల పరిధిలోని ప్రతి నిర్మాణం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రధాన పాత్ర పోషించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబా ద్‌ నుంచి గ్రామాల్లోని భవనాలను ఆన్‌లైన్‌ చేస్తుండంపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, సీఈవోలు, డీఎల్‌పీవోలు, సర్పంచులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి సర్వే నెంబర్‌లో నిర్మా ణం జరిగి ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో నమోదు చే యాలన్నారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని పేరు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, నిర్మాణ ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. టీఎస్‌ఎన్‌పీబీ యాప్‌ను విడుదల చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ప్రతి ఇంటికి వెళ్లి ఫొటోతీసి అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఆన్‌లైన్‌ ప్రక్రియ చివరి దశలో ఉన్నదని మంత్రికి వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 129,831 నిర్మాణాలను ఆన్‌లైన్‌లో నమోదు చే యడం పూర్తి చేసినట్లు చెప్పారు. కాన్ఫరెన్‌లో పంచాయతీరాజ్‌ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌సింగ్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు ఆన్‌లైన్‌ నమోదుపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో సీఈవో ముషాయిదా బేగం, డీపీవో కృష్ణ, డీఎల్‌పీవో శ్యాంసుందర్‌  పాల్గొన్నారు.